16ఏళ్ల తర్వాత ప్రభాస్-నయన్.. ఏ సినిమాలో అంటే
వివరాళ్లోకి వెళితే... మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది.
By: Tupaki Desk | 23 Sep 2023 8:26 AM GMTపాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ - నయనతార చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2007లో యోగి సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు.. ఇప్పుడు మళ్లీ 16 ఏళ్ల తర్వాత కలిసి నటించేందుకు సిద్ధమయ్యారట. ఇంతకీ ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించనున్న సినిమా ఏంటో తెలుసా?
వివరాళ్లోకి వెళితే... మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైలాగ్ కింగ్ మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. అది కూడా శివుడి పాత్రలో అని ప్రచారం సాగగా.. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్‌తో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
అయితే ఇప్పుడిదే సినిమాలో నయనతార యాక్ట్ చేయనుందని తెలిసింది. ఈ విషయాన్ని సీనియర్ నటి మధు బాల కన్ఫామ్ చేశారు. ఆమె తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్-నయతార ప్రాజెక్ట్ లో భగమయ్యారని స్పష్టత ఇచ్చారు. అయితే ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా నయన్ పార్వతిగా కనిపించనుందని బయట టాక్ వినిపిస్తోంది.
అంటే యోగి సినిమా తర్వాత అంటే.. దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి మళ్లీ ప్రభాస్-నయన్ నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే నయన్.. పలు సినిమాల్లో అమ్మవారిగా కనిపించి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే కన్నప్ప చిత్రం విషయానికొస్తే.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి స్వరాలు సమకూరుస్తున్నారు. విదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది.
కాగా, ప్రభాస్ త్వరలోనే సలార్, ప్రాజెక్ట్ కె కల్కి, స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాతో పలకరించనున్నారు. ఇక నయనతార ఇటీవలే షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.