Begin typing your search above and press return to search.

రాజా సాబ్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్..!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూ సడెన్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   20 April 2024 4:53 AM GMT
రాజా సాబ్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూ సడెన్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. సినిమా అనౌన్స్ మెంట్ కు ముందే సెట్స్ మీదకు వెళ్లింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఏంటని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. కానీ రాజా సాబ్ నుంచి వచ్చిన లీక్డ్ ఫోటోస్ ఇక అఫీషియల్ గా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి మారుతి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడని అనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో నిర్మిస్తున్న రాబా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా కథ థ్రిల్లర్ నేపథ్యంతో ఉంటుందని తెలుస్తుండగా మారుతి ఈ సినిమాను తన మార్క్ ఎంటర్టైనింగ్ పంథాలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ కొంతకాలంగా సీరియస్ కథలనే చేస్తూ వస్తున్నాడు. ప్రభాస్ బుజ్జిగాడు తరహా కామెడీ చేసి చాలా రోజులైంది. హీరో క్యారెక్టర్ అది కూడా స్టార్ హీరో జోవియల్ గా ఉంటూ కథను నడిపిస్తే చాలా బాగుంటుంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ లార్జర్ ద్యాన్ లైఫ్ పాత్రలు చేస్తూ వచ్చాడు కానీ రాజా సాబ్ లో మాత్రం చాలా న్యాచురల్ గా వింటేజ్ ప్రభాస్ ని చూపించాలని చూస్తున్నాడట మారుతి. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాత్రం అదిరిపోతుందని చెప్పుకుంటున్నారు. మొదటి రెండు మూడు సినిమాలు పక్కన పెడితే మారుతి సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా కడుపుబ్బా నవ్వుకునేలా తెరకెక్కిస్తాడు.

ఆ విషయంలో మారుతికి సెపరేట్ క్రేజ్ ఉంది. ప్రభాస్ రాజా సాబ్ విషయంలో కూడా మారుతి తన బలాలైన కామెడీని బాగా వర్క్ అవుట్ చేయిస్తున్నాడని తెలుస్తుంది. రాజా సాబ్ ఫ్యాన్స్ కు ఓ పక్క మాస్ అంశాలతో ఫుల్ మీల్స్ పెడుతూనే మరోపక్క ఎంటర్టైనింగ్ గా ఉంటూ కితకితలు పెట్టిస్తుందని అంటున్నారు. ప్రభాస్ సినిమాతో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మరి రాజా సాబ్ అది నిజం చేస్తాడా లేదా అన్నది చూడాలి. ప్రభాస్ రాజా సాబ్ 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈసారి సంక్రాంతికి రెబల్ స్టార్ మాస్ మేనియా చూడబోతున్నామని చెప్పొచ్చు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా మే 9 నుంచి దాదాపు వాయిదా పడుతుందని తెలుస్తుండగా కల్కి మొదటి పార్ట్ జూన్, జూలై లో రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయని టాక్.