Begin typing your search above and press return to search.

రాజ్ సాబ్.. ఇంకాస్త ఓపిక పడితే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సలార్, కల్కి 2898ఏడీ చిత్రాలతో రెండు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు

By:  Tupaki Desk   |   11 July 2024 4:52 AM GMT
రాజ్ సాబ్.. ఇంకాస్త ఓపిక పడితే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సలార్, కల్కి 2898ఏడీ చిత్రాలతో రెండు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. కల్కి మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి విజువల్ స్పెక్టక్యులస్ గా నిలిపాడు. అందుకే అద్భుతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. గత రెండేళ్ల కాలంలో టాలీవుడ్ కి వచ్చిన అతి పెద్ద హిట్ కల్కి మూవీ అని చెప్పొచ్చు.

అలాగే నిర్మాతకి, డిస్టిబ్యూటర్స్ కి కూడా కల్కి మూవీ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. డార్లింగ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, అమితాబ్ బచ్చన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సుమతి పాత్రలో దీపికా పదుకునే వండర్ ఫుల్ యాక్టింగ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరో రెండు వరాల పాటు కల్కి మూవీ థియేటర్స్ లో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ రిలీజ్ కావడంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా రాజాసాబ్ మీద పడింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. 150+ కోట్ల బడ్జెట్ తో మూవీ రెడీ అవుతోంది. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని మారుతి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50% శాతం కంప్లీట్ అయిపోయిందని టాక్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కల్కి సందడి ముగియనుండటంతో మారుతి టీమ్ రాజాసాబ్ సినిమా పబ్లిసిటీపై ఫోకస్ చేయబోతోందంట. అందులో భాగంగా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకూలంగా జరిగితే ఈ నెలలోనే గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. రాజాసాబ్ సినిమాని మార్కెట్ లోకి తీసుకొని వెళ్తే సినిమాపై బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుందని నిర్మాత భావిస్తున్నారు.

కల్కి సినిమా సక్సెస్ వైబ్ ని ఉపయోగించుకోవాలంటే వీలైనంత వేగంగా మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారంట. డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ కామెడీ జెనరేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మూవీలో మాళవిక మొహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.