Begin typing your search above and press return to search.

రాజా సాబ్ లో ఆ స్టార్ హీరోయిన్ క్యామియో..?

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది.

By:  Tupaki Desk   |   30 July 2024 1:30 PM GMT
రాజా సాబ్ లో ఆ స్టార్ హీరోయిన్ క్యామియో..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎన్ని వందల కోట్లు వసూళ్లను రాబడుతుందో అనే అంచనాలతో ఉన్నారు. రికార్డుల లెక్కలు అటుంచితే ప్రభాస్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని మస్ జబర్దస్త్ ఖుషి అయ్యేలా చేస్తుంది. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది.

అందరు పాన్ ఇండియా టీజర్ అని రిలీజ్ చేస్తే తనకు నేషనల్ వైడ్ ఆడియన్స్ అంతా ఫ్యాన్సే కాబట్టి రాజా సాబ్ నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. రాజా సాబ్ గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమాలో కచ్చితంగా ప్రభాస్ ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో చూడబోతున్నామని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. తనను అద్దంలో చూసుకుని తనే సూపర్ అనుకునే ప్రభాస్ ని ఇప్పటివరకు తెర మీద చూడలేదు.

రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. నిధి అగర్వాల్ కూడా సెకండ్ హీరోయిన్ గా చేస్తుందని టాక్. ఐతే వీరిద్దరే కాకుండా సినిమాలో మరో సర్ ప్రైజ్ స్టార్ కూడా భాగం కానుందట. ప్రభాస్ సినిమా అంటే చాలు ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా ఓకే చెప్పే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందుకే సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ కోసం స్టార్ హీరోయిన్ ను దించుతున్నాడట మారుతి. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు స్వీటీ అనుష్క అని తెలుస్తుంది.

ప్రభాస్, అనుష్క ఈ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించలేదు. ప్రభాస్ రాజా సాబ్ కోసం మారుతి అనుష్కని కూడా సినిమాలో భాగం చేస్తున్నాడని టాక్. సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యామియోలో అనుష్క కనిపిస్తుందని అంటున్నారు. ఐతే చిత్ర యూనిట్ నుంచి మాత్రం అనుష్క రాజా సాబ్ న్యూస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం రాజా సాబ్ డబుల్ ధమాకా అనిపిస్తుందని చెప్పొచ్చు.