Begin typing your search above and press return to search.

గ్లింప్స్: రాజా సాబ్ వచ్చేశాడు.. ఆ లుక్ చూస్తే ఫిదా

ఇక విడుదల చేసిన గ్లింప్స్ లో ప్రభాస్ కారుకు ఉన్న మిర్రర్ లో స్టైలిష్ నవ్వుతో కనిపించడం విశేషం. ఇక ఆ నవ్వుకు పూల వర్షం కురిపించడం మరో హైలెట్.

By:  Tupaki Desk   |   29 July 2024 12:23 PM GMT
గ్లింప్స్: రాజా సాబ్ వచ్చేశాడు.. ఆ లుక్ చూస్తే ఫిదా
X

రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన అభిమానులను అలరించేందుకు 'ద రాజా సాబ్' చిత్రంతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హడావుడి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఫ్యాన్ లో ఇప్పటికే ఊర పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ పై ఇటీవల ఒక పోస్టర్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ను ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులలో ఆసక్తిని పెంచారు.

ఇక అనుకున్న టైమ్ కి ఆ గ్లింప్స్‌ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇక ప్రభాస్ తన వింటేజ్ ఎనర్జీతో మెరిసిపోతున్నారు. ప్రభాస్ స్టైలిష్ లుక్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ని, సినీ ప్రియులను అలరిస్తున్నాడు. 'ద రాజా సాబ్' సినిమాను 2025 ఏప్రిల్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రభాస్ రొమాంటిక్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇక విడుదల చేసిన గ్లింప్స్ లో ప్రభాస్ కారుకు ఉన్న మిర్రర్ లో స్టైలిష్ నవ్వుతో కనిపించడం విశేషం. ఇక ఆ నవ్వుకు పూల వర్షం కురిపించడం మరో హైలెట్. ఎలాంటి డౌట్స్ లేకుండా సినిమా హారర్ రొమాంటిక్ కామెడీ అని ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం 40% చిత్రీకరణ పూర్తవ్వగా, ఆగస్టు 2 నుండి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించగా, రామ్ ల‌క్ష్మణ్ మాస్టర్స్ మరియు కింగ్ సోలమన్ ఫైట్ కొరియోగ్రాఫీల బాధ్యతలు చేపట్టారు.

బాహుబలి ఫేమ్ కమలకన్నన్ ఆర్సీ వీఎఫ్‌ఎక్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు, అందువలన ప్రేక్షకులకు విజువల్ కు ఫిదా అవుతారని చెప్పవచ్చు. దర్శకుడు మారుతి తన విభిన్న కథలతో సూపర్ హిట్ చిత్రాలను అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 'ప్రతి రోజు పండగే', 'ప్రేమ కథా చిత్రం', 'మహానుభావుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో మారుతి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు.

ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి మారుతి 'ద రాజా సాబ్' సినిమాను తెరకెక్కించడం పట్ల అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వరుసగా సూపర్ హిట్ కమర్షియల్ చిత్రాలను నిర్మించిన విశ్వ‌ప్ర‌సాద్, 'ద రాజా సాబ్' చిత్రాన్ని కూడా భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలంటే, ఇది టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ స్థాపించిన ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్.

ఈ ప్రొడక్షన్ హౌస్ పలు హిట్ చిత్రాలను నిర్మించడంలో అనుభవం ఉంది. ఇప్పుడు 'ద రాజా సాబ్' చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో రాబోయే 'ద రాజా సాబ్' చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.