Begin typing your search above and press return to search.

సలార్.. ఇంకా చర్చల్లోనే సాగుతోంది..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా హై వోల్టేజ్ పాన్ ఇండియా మూవీ సలార్

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:09 AM GMT
సలార్.. ఇంకా చర్చల్లోనే సాగుతోంది..
X

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా హై వోల్టేజ్ పాన్ ఇండియా మూవీ సలార్. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మొస్తోంది. పార్ట్ 1న డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటి వరకు సినిమా నుంచి ఒక్క ట్రైలర్ మాత్రమే వదిలారు. ఆ ట్రైలర్ బాగానే ఉన్న ఫ్యాన్స్ అంచనాలని అందుకోలేకపోయింది.

అలాగే సినిమాపైనే కూడా భారీ హైప్ ని క్రియేట్ చేయలేకపోయింది. ట్రైలర్ తో సౌండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ భావించింది. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత వారు ఎక్స్ పెక్ట్ చేసినవిధంగా జరగలేదు. రిలీజ్ కి ఇంకా 10 రోజుల సమయమే ఉన్న సలార్ సినిమాపై ఎలాంటి బజ్ నడవడం లేదు. దీంతో డిస్టిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతోంది.

కనీసం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేయలేదు. అయితే ఒక కామన్ ఇంటర్వ్యూ ఇచ్చి అన్ని ఛానల్స్ కి పంపించాలని అనుకున్నారు. కానీ వేరే భాషలకి సెట్ కాదని డ్రాప్ అయ్యారంటే. ఇప్పుడు మూవీకి హైప్ క్రియేట్ చేయడం కోసం సాంగ్స్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అలాగే సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారంట.

ఈ రెండుంటి యాక్టివిటీస్ మీద ప్రస్తుతం చిత్ర యూనిట్ దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సెకండ్ ట్రైలర్, సాంగ్స్ వస్తే మూవీ చుట్టూ కొంత బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సమయం దగ్గరపడిన తర్వాత ఏం చేసిన ప్రయోజనం ఉండదు. ఈ ఎఫెక్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ మీద పడే ప్రమాదం ఉంది. ఈ బజ్ లేకపోవడం వలన ఆదిపురుష్ సినిమాకి జరిగినట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదంట.

మరి సినిమాకి ప్రశాంత్ నీల్ టీమ్ ఏ విధంగా బూస్టింగ్ తీసుకొస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్స్ పూర్తిగా పక్కన పెడితే ఎంత స్టార్ కాంబినేషన్ అయిన ఎంతో కొంత ఇంపాక్ట్ అయితేకచ్చితంగా ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.