'సలార్' పై మాలీవుడ్...శాండిల్ వుడ్ ఎటాక్ తప్పదా!!
ఇదేమి చిన్న చితకా చిత్రం కాదు. మాలీవుడ్ సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం
By: Tupaki Desk | 17 Dec 2023 7:32 AM GMTఇంతవరకూ 'సలార్' కు గట్టిపోటీనిచ్చేది 'డంకీ' మాత్రమే అనుకున్నారంతా. హిందీలో ప్రభాస్ మార్కెట్ పై షారుక్ ఖాన్ ప్రభావం చూపిస్తాడు తప్ప మిగతా ఏరియాల్లో డార్లింగ్ దున్నేస్తాడని అంతా భావించారు. కానీ 'సలార్' కి సౌత్ నుంచే సవాల్ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 21న సలార్ పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న మాలీవుడ్ చిత్రం 'నెరో' రిలీజ్ అవుతుంది.
ఇదేమి చిన్న చితకా చిత్రం కాదు. మాలీవుడ్ సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం. 'దృశ్యం'..'దృశ్యం 2' విజయాలతో జీతు క్రేజ్ పాన్ ఇండియాలో రెట్టింపు అయింది. మోహన్ లాల్ -జీతో కలిస్తే ఆ సంచలనం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సైలెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ అందుకోవడం ఆ ద్వయం ప్రత్యేకత. జీతో సినిమాలు పాన్ ఇండియాలో అలా ఫేమస్ అయినవే. ఆ రకంగా సలార్ పై కేరళలో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది.
అలాగే శాండిల్ వుడ్ నుంచి బాక్సాఫీస్ వార్ లో కన్నడ చిత్రం నిలిచింది. శాండిల్ వుడ్ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా నటిస్తోనన్న 'కాటేరా' అనే చిత్రం రిలీజ్ అవుతుంది. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన చిత్రం డిసెంబర్ 29న రిలీజ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే వారం గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఈ సమయంలో 'సలార్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆ కాటేరా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక బాలీవుడ్ నుంచి ఎలాగూ 'డంకీ' రిలీజ్ అవుతుంది. ఒక రోజు గ్యాప్ లోనే రెండు రిలీజ్ అవుతు న్నాయి కాబట్టి ఎలాగూ పోటీ తప్పదు. ఏ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వారిదో అప్పర్ హ్యాండ్ అవుతుంది. 'డంకీ' కన్నా 'సలార్' పైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల ప్రచార విషయంలో హీరోలు కూడా డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చింది లేదు.