Begin typing your search above and press return to search.

రికార్డ్​ బ్రేక్​ ఓపెనింగ్స్​ దిశగా 'సలార్'​.. RRR బీట్ చేస్తుందా?

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ గ్యాంగ్​ స్టర్​ మూవీ 'సలార్' విడుదల తేదీ సమయం ఇక రోజుల్లోకి వచ్చేసింది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 6:55 AM GMT
రికార్డ్​ బ్రేక్​ ఓపెనింగ్స్​ దిశగా సలార్​.. RRR బీట్ చేస్తుందా?
X

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ గ్యాంగ్​ స్టర్​ మూవీ 'సలార్' విడుదల తేదీ సమయం ఇక రోజుల్లోకి వచ్చేసింది. ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్​లోనూ ఇదే హైప్ కనిపిస్తోంది. ఇప్పుటికే మొదలైన బుకింగ్స్​ చూస్తుంటే భారీ ఓపెనింగ్స్​ దక్కుతాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

ఈ చిత్రం యూఎస్ బుకింగ్స్​లో ఫుల్​ జోరు చూపిస్తోందంటూ రోజు వార్తలు కూడా వస్తున్నాయి. రికార్డులు క్రియేట్​ చేస్తూ ముందుకెళ్తోందని అంటున్నారు. అయితే యునైటెడ్​ స్టేట్స్​లో గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరెకక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ తొలి రోజు కలెక్షన్స్​ పరంగా అదిరిపోయే రికార్డ్​ సెట్​ చేసింది. ప్రీమియర్స్​, మొదటి రోజు కలిపి దాదాపు రూ.5.5 మిలియన్ డాల్లర వసూళ్లను సాధించింది.

ఈ రేంజ్​ వసూళ్లను సాధించడం కోసం ఆర్​ఆర్​ఆర్​ మూవీ ఎక్కువగానే శ్రమించింది. నెలల ముందు నుంచే అక్కడ ప్రమోషన్స్​ భారీగానే చేసింది. సలార్​ కూడా అక్కడ ప్రమోషన్స్​ విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. బుకింగ్స్​ కూడా ఓపెన్ చేసేసింది. ఇక ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్​ ముందు సెప్టెంబర్​ 27న ప్రీమియర్స్​కు సిద్ధమైంది. ఇప్పటికే 500కే డాలర్ల సేల్స్​ అయినట్లు తెలిసింది.

ఇదే జోరు కొనసాగితే.. మూడు నుంచి నాలుగు మిలియన్​ డాలర్స్​ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలే ఇప్పటికే ప్రభాస్​ బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్​లో భారీ హిట్​ అందుకోలేదు. ఇక ఈ సలార్​తో అలాంటి రేంజ్ హిట్​ పక్కాగా అందుకుంటారని అభిమానులు, సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఎందుకంటే కేజీయఫ్ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​ బ్రాండ్​తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి రానుంది.

ఇప్పటికే రిలీజైన టీజర్​ ఆడియెన్స్​, అభిమానులను బాగా ఆకట్టుకుంది. త్వరలోనే ట్రైలర్​ కూడా రిలీజ్​ చేయనున్నారు. సినిమాలో యాక్షన్​కు పెద్ద పీట వేశారని అర్థమవుతోంది. కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంటుందని భారీ అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్స్​ భారీగా దక్కుతాయని, రూ.1000కోట్లు పక్కా అని భావిస్తున్నారు. యూఎస్​ బాక్సాఫీస్​ ముందు కూడా ఆర్​ఆర్​ఆర్​ రేంజ్​ ఓపెనింగ్స్​కు దగ్గరగా వస్తుందని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..