సలార్ లో కూడా అలాంటి సెంటిమెంట్
By: Tupaki Desk | 30 July 2023 11:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తున్నారు. వచ్చే ఏడాది సలార్ పార్ట్ 2 రిలీజ్ కానుంది. ఇప్పటికే సలార్ 1 మూవీకి సంబందించిన టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి కనెక్ట్ అయ్యింది.
ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ డీల్స్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అంటే కచ్చితంగా యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు మూవీ సెంటిమెంట్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ కేజీఎఫ్ సిరీస్ లో తల్లి సెంటిమెంట్ భాగా వర్క్ అవుట్ అయ్యింది. దీనికోసమే సినిమా చూసేవారు ఉన్నారు.
ఇప్పుడు సలార్ సినిమాలో మదర్ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుందంట. అలాగే స్నేహితుల బాండింగ్ ని కూడా ఈ మూవీలో చాలా పవర్ ఫుల్ గా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. తల్లికి, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం హీరో ఎం చేసాడనేది మూవీలో ఉంటుందంట. ఈ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరి హృదయాలకి కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
సలార్ సినిమాని యాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో నిలబడతాయో అంతకు మించి ఈ సెంటిమెంట్ ఉంటుందంట. సలార్ అంటే మహారాజుకి అండగా ఉంటూ అతని సైన్యానికి నాయకత్వం వహించే వాడు అని అర్ధం వస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా ప్రభాస్ పాత్ర అలాగే ఉంటుందంట.
సైన్యానికి నాయకుడిగా ఉండే వాడు అని అర్ధం. మరి భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ మూవీపైన డార్లింగ్ అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆదిపురుష్ డిజాస్టర్ కావడంతో కచ్చితంగా ప్రభాస్ కి ఈ మూవీ మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.