Begin typing your search above and press return to search.

'చంద్ర‌యాన్-3' విజయానికి 'స‌లార్' విధికి లింకేంటి?

చంద్రయాన్ 3 (మిషన్ మూన్) గ్రాండ్ సక్సెస్ అయింది. 2019 విఫ‌ల‌ ప్రయత్నం తర్వాత భార‌త్ విజయం తీపి రుచి చూసింది

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:38 AM GMT
చంద్ర‌యాన్-3 విజయానికి స‌లార్ విధికి లింకేంటి?
X

చంద్రయాన్ 3 (మిషన్ మూన్) గ్రాండ్ సక్సెస్ అయింది. 2019 విఫ‌ల‌ ప్రయత్నం తర్వాత భార‌త్ విజయం తీపి రుచి చూసింది. ప్రస్తుతం చంద్రునిపై మ‌న ల్యాండ్ రోవ‌ర్ విక్ర‌మ్ అడుగుపెట్టినందుకు ప్ర‌తిభార‌తీయుడు గర్వపడుతున్నాడు. 23 ఆగస్ట్ 2023 .. చంద్రయాన్ 3 విజయం భారతదేశ చరిత్రలో ఎన్న‌టికీ గుర్తుండిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ స‌హా కోట్లాది మంది భారతీయులతో పాటు ఈ క్షణాన ఎంతో ఆనందం వ్య‌క్తం చేసారు. ఇస్రోకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆస‌క్తిక‌రంగా చంద్రయాన్ 3 విజయాన్ని ప్రభాస్ అభిమానులు `స‌లార్‌`తో ముడిపెట్ట‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

చంద్రయాన్ 3 విజయవంతమైనందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇస్రోను అభినందించారు. ప్రభాస్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను తీసుకొని చంద్రయాన్ 3ని విజయవంతమైన మిషన్ గా మ‌లిచిన‌ ఇస్రోని అభినందించాడు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇస్రోను ట్యాగ్ చేశాడు. దీంతో ఇటు ద‌క్షిణాది అటు ఉత్త‌రాదికి చెందిన డార్లింగ్ అభిమానుల్లో ప్ర‌కంప‌నం మొద‌లైంది. ప్ర‌భాస్ తో క‌లిసి ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో సంబ‌రాలు చేసుకున్నారు.

అయితే ప్ర‌భాస్ అభిమానులు త‌మ ఉత్సాహాన్ని అక్క‌డికే ప‌రిమితం చేయ‌లేదు. మూన్ మిష‌న్ విజ‌యాన్ని సలార్ తో లింక‌ప్ చేసారు. ఈ శుభ‌సంద‌ర్భంలో అభిమానులు ఎగ్జ‌యిట్ మెంట్ ని ఆపుకోలేక‌పోయారు.. చంద్రయాన్ 3 విజయం సాధించ‌డం స‌లార్ కి క‌లిసొస్తుంద‌ని ఫ్యాన్స్ ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విజయవంతమైన ల్యాండింగ్ స‌లార్ స్టార్ ప్ర‌భాస్ విధిని మారుస్తుందని ఫ్యాన్స్ బ‌లంగా నమ్ముతున్నారు. స‌లార్ ని కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించారు.

ప్ర‌భాస్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అదే క్ర‌మంలో స‌లార్ బాక్సాఫీస్ రికార్డుల‌పై భారీ అంచ‌నాలున్నాయి. సెప్టెంబ‌ర్ లో ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. ఆదిపురుష్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి అభిమానులు స‌లార్ ఘ‌న‌విజ‌యాన్ని ఆశిస్తున్నారు. అందుకే మూన్ మిష‌న్ విజ‌యాన్ని వారు గొప్ప‌గా ఆస్వాధిస్తున్నారు.