దూసుకెళ్తున్న సలార్ బుకింగ్స్.. కళ్లు చెదిరేలా
వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం సలార్.
By: Tupaki Desk | 27 Aug 2023 1:26 PM GMTవరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం సలార్. రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకి మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే 'సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా యూఎస్ ప్రీ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే US అడ్వాన్స్ బుకింగ్స్ $300K (మూడు వందల వేలు డాలర్స్, 2.5కోట్లు) అందుకున్న ఈ చిత్రం... ఇప్పుడు మరింత ఫుల్ స్వింగ్ లో దుసుకెళ్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇప్పుడా ప్రీ బుకింగ్స్ సంఖ్య $334,108(2.75కోట్లు) చేరుకున్నట్లు తెలిసింది. 290 లొకేషన్స్ లో 848 షోలకు 11639 టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు సమాచారం తెలిపాయి.
ఇకపోతే సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్నా చిత్రబృందం ఇంకా ప్రమోషన్స్ ను ప్రారంభించలేదు. ఈ విషయంలో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే
మూవీటీమ్ త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఈ ప్రచార చిత్రం హైఓల్జేట్ గా ఉండనుందని అంటున్నారు.
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు 'కేజీయఫ్' ను మించి ఉంటాయని, క్లైమాక్స్ లో ఏకంగా వెయ్యి మందితో ప్రభాస్ తలపడతారని కూడా ప్రచారం సాగుతోంది. సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారనే టాక్ కూడా బయటకు వచ్చింది. దీంతో సినిమాపై క్యూరియాసిటీని చాలా ఎక్కువగా ఉంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. 'కేజీయఫ్' సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ప్రతినాయకులుగా కనిపించనున్నారు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.