Begin typing your search above and press return to search.

సలార్.. అసలు సమస్యేంటీ?

కెజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. బాహుబలి ప్రభాస్ తో కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా సలార్.

By:  Tupaki Desk   |   2 Sep 2023 11:19 AM GMT
సలార్.. అసలు సమస్యేంటీ?
X

కెజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. బాహుబలి ప్రభాస్ తో కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా సలార్. మరి కొన్ని రోజుల్లో విడుదల కావాల్సిన సమయంలో వాయిదా పడిందంటూ పెద్ద బాంబే అభిమానులపై పడింది. అయితే దీనిపై అధికార ప్రకటన రాకపోయినప్పటికీ.. ఇది కన్ఫామే అని తెలుస్తోంది.

అయితే సలార్ వాయిదాకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. సీజీ వర్క్ బాగో లేదని.. అందుకే వాయిదా అనే టాక్ ఒకటి కూడా వినిపిస్తోంది. కానీ ఇవేమీ అసలు కారణం కాదని తెలిసింది. డిజిటల్ రైట్స్ అమ్మకం పూర్తి కానందునే ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందని దాదాపు కన్ఫామ్ అయింది.

హోంబలే ఫిల్మిస్ నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్ నీల్.. సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టుకుని, తక్కువ లాభాలు తీసుకునే వ్యక్తులు కాదు. పెట్టిందానికి పదింతలు ఎక్కువ లాభాలు తీసుకునే బిజినెస్ స్ట్రాటజీ ఉన్నావారు. గతంలోనూ వారు ఇలానే సినిమాలు చేశారు.

అయితే నిర్మాతలు సలార్ విషయంలో మాత్రం ఆంధ్ర, తెలంగాణలో అమ్మకానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రలో రూ.85 కోట్లు, నైజాంలో రూ.80 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కింద ఇవ్వాలనుకుంటున్నారట. ఎందుకంటే.. సలార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విక్రయాలు ఇంకా జరగలేదని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయట.

ఈ ఒప్పందం ఎందుకు ఆలస్యమవుతుందంటే.. ఇప్పటికే అమెజాన్ తో సహా పలు ఓటీటీ సంస్థలు వంద కోట్లు పెట్టి డిజిటల్ రైట్లు కొనుగోలు చేసి భారీ నష్టాన్ని చూశాయట. అందుకే బడ్జెట్ పరిమితులు స్వంతంగా విధించుకున్నాయని తెలిసింది. అమెజాన్ కు సంబంధించి ఈ ఏడాది పెట్టుకున్న నిర్ణీత బడ్జెట్ ఖర్చయిపోయిందని సమాచారం అందింది. అలాగే నెట్ ఫిక్స్ కు కూడా వచ్చే ఏడాది తొలి రెండు క్వార్టర్ల నిధుల కూడా కేటాయింపులు జరిగిపోయాయట.

అందుకే సలార్ మేకర్స్ కు.. అమెజాన్ ప్రైమ్ తో ఇంకా ఎటువంటి సెటిల్ మెంట్ కాలేదట. ఇది సెటిల్ అయితేనే సలార్ పై ఫైనాన్స్ బర్డెన్ ఉండదు. లేదంటే అమ్మకాలు జరిపాల్సి ఉంటుంది. అందుకే సంప్రదింపులు జరుపుతూనే.. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో అమ్మకాలకు ప్రయత్నిస్తున్నారు. ఏ సినిమా అయినా సరే.. విడుదలకు ముందు నాన్ థియేటర్ అమ్మకాలు జరిగితేనే సేఫ్ అవ్వొచ్చు. లేదంటే అనవసరపు ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సలార్.. రిలీజ్ డేట్ పై ముందు వెనక అడుగులు వేస్తూ సతమతమవుతోందని తెలుస్తోంది.