Begin typing your search above and press return to search.

సలార్ మేకర్స్.. ఇలా అయితే ఏమనుకోవాలి?

భారతీయ చలన చిత్ర పరిశ్రమంతా చర్చించుకునేలా చేసిన నిర్మాణ సంస్థల్లో హోంబలే ఫిల్మ్స్‌ ఒకటి.

By:  Tupaki Desk   |   3 Sep 2023 7:04 AM GMT
సలార్ మేకర్స్.. ఇలా అయితే ఏమనుకోవాలి?
X

భారతీయ చలన చిత్ర పరిశ్రమంతా చర్చించుకునేలా చేసిన నిర్మాణ సంస్థల్లో హోంబలే ఫిల్మ్స్‌ ఒకటి. కేజీయఫ్‌ తో వెయ్యి కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సంస్థ.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత కాంతారతోనూ రికార్డులు బద్దలు కొట్టి.. ఓ గొప్ప నిర్మాణ సంస్థగా మరింత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. అయితే ఇప్పుడీ సంస్థ ఓ గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసి.. సంపాదించుకున్న తన ఇమేజ్ ను తానే స్వయంగా డ్యామేజ్ చేసుకుంటున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే.. ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ లలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గ్యాంగ్ స్టర్ మూవీ సలార్ కూడా ఒకటి. భారీ అంచనాలను క్రియేట్ చేసి.. మరి కొన్ని రోజుల్లో విడుదలకు రెడీ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధతను ఎదుర్కొంటోంది. ఔట్ పుట్ సరిగ్గా లేదని, డిజిటల్ రైట్స్ విక్రయాలు జరగలేదని.. ఇలా పలు కారణాలతో సినిమా వాయిదా అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఓ గందరగోళ పరిస్థితి క్రియేట్ అయిపోయింది. కానీ దీనిపై నిర్మాణ సంస్థ మాత్రం నోరు విప్పకుండా మౌనం పాటిస్తోంది.

దానికి తోడు కొద్ది రోజుల క్రితం నుంచే సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ కూడా చేయకుండా అభిమానులను నిరాశ పరిచింది. ఓ భారీ సినిమా వస్తుందంటే ప్రమోషన్స్, షెడ్యూల్ ప్లాన్స్ ఎలా ఉండాలి, మోత మోగిపోవాలి. అన్నీ పక్కాగా టైమ్ టు టైమ్ జరిగిపోవాలి. కానీ సలార్ విషయంలో ఏమీ కనపడట్లేదు. అలా ఈ కారణాలతో పాటు ఇప్పుడు వాయిదా ప్రచారం హోంబలే ఫిల్మ్స్​ పై విమర్శలు మొదలయ్యాయి.

ఈ నిర్మాత సంస్థ.. రిలీజ్ డేట్ గురించి స్పష్టతమైన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా ఇతర నిర్మాణ సంస్థలను కాస్త ఇబ్బందికి గురి చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సలార్ లాంటి భారీ సినిమా వస్తుందంటే.. ఆ సమయంలో ఏవీ విడుదలకు సాహసం చేయవు. అది లేని సమయం చూసి షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుని రిలీజ్ డేట్స్ ను కన్ఫామ్ చేసుకుంటాయి.

కానీ ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ పై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వకుండా సందిగ్ధత కొనసాగిస్తోంది. దీంతో ఇతర ప్రొడక్షన్ హౌస్ లు తమ సినిమాల రిలీజ్ కు సంబంధించిన షెడ్యూల్స్ ను హోల్డ్ లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ప్రస్తుత పరిస్థితి హోంబలే ఇమేజ్ పై కాస్త నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. సలార్ ఔట్ పుట్, విడుదల ప్రణాళిక విషయాన్ని సమర్థవంతంగా ఫేస్ చేయలేకపోయిందని, ఇదీ ఆ సంస్థకు ఓ బ్లాక్ మార్క్ లా ఉండిపోవచ్చని చెబుతున్నారు.