సలార్ వాయిదాతో మార్కెట్ లెక్కలు మారుతాయా?
హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కి రెడీ అయ్యి సడెన్ గా వాయిదా పడటం వలన మూవీపైన ఉండే బజ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది
By: Tupaki Desk | 7 Sep 2023 4:18 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ ఆఖరులో లేదంటే డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదు.
సలార్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా చాలా హైప్ క్రియేట్ అయ్యి ఉంది. కచ్చితంగా ఈ మూవీతో ప్రభాస్ ఖాతాలో సూపర్ హిట్ పడుతుందని అందరూ భావించారు. బాహుబలి సిరీస్ తర్వాత మరోసారి వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకునే చిత్రంగా నిలుస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే సడెన్ గా రిలీజ్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ కాస్తా నిరుత్సాహానికి గురయ్యారు.
హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కి రెడీ అయ్యి సడెన్ గా వాయిదా పడటం వలన మూవీపైన ఉండే బజ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అది కలెక్షన్స్ పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో రాజమౌళి బాహుబలి సినిమాపైన అలాగే భారీ అంచనాలు నెలకొని ఉండగా సడెన్ గా రిలీజ్ వాయిదా పడటంతో కలెక్షన్స్ కొంతవరకు తగ్గాయి. అనుకున్న టైంకి రిలీజ్ చేసి ఉంటే బాహుబలి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేదని అంచనా వేస్తున్నారు.
అలాగే అలాగే శంకర్ రోబో 2.ఓ మీద భారీ హైప్ అప్పట్లో క్రియేట్ అయ్యింది. రోబో మూవీ సూపర్ హిట్ కావడంతో 2.ఓ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. అనూహ్యంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఆ ప్రభావం కలెక్షన్స్ మీద పడింది. చెప్పిన టైంకి రిలీజ్ కావడం వలన కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకి కలెక్షన్స్ ఊహించని స్థాయిలో అంచనాలకి మించి సొంతం చేసుకున్నాయి.
ఇలా పెద్ద సినిమాలకి ముందే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ ఉండటం ఫ్యాన్స్ , రెగ్యులర్ ఆడియన్స్ ఆ రోజుకి మూవీ వస్తుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడగానే సినిమా చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే సడెన్ గా వాయిదా వేయడం వలన ప్రేక్షకులలో ఉండే ఆ థ్రిల్ పోతుందని, అది కచ్చితంగా కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా.