ఎప్పుడొచ్చినా సలార్ టెన్షన్ తప్పేలా లేదు!
ఇక సల్మాన్ సొంత భాష అదే కాబ్టటి ఆయనకు ఎలాగూ తిరుగుండదు. హిట్ టాక్ వచ్చిందంటే సక్సెస్ నల్లేరు మీద నడకలాంటిది
By: Tupaki Desk | 9 Sep 2023 6:48 AM GMTఇండియాస్ మోస్ట్ వాంటెండ్ పాన్ ఇండియా చిత్రం 'సలార్' వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈనెలలో రిలీజ్ అవ్వాల్సిన చిత్రాన్ని యూనిట్ అనూహ్యంగా వాయిదా వేసింది. దీంతో మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అభిమానులు అప్పుడే ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే సలార్ వాయిదాతో అన్ని భాషల సినిమాలకి ఆటకం ఏర్పడుతుంది. సలార్ కొత్త రిలీజ్ తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు.
వాళ్లు ఎప్పుడొచ్చినా సెలవులు..సీజన్ కలిసొచ్చేలా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆయా సీజన్లలో కొన్ని సినిమాలు రిలీజ్ తేదీ ని లాక్ చేసి పెట్టుకున్నాయి. సలార్ నుంచి గనుక అలాంటి ప్రకటనొస్తే వాళ్లు వెనక్కి వెళ్లక తప్పదు. అగ్ర హీరోలు తప్పా! చాలా సినిమాలు ఉన్న పళంగా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగని 2024 లో సినిమా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు.
మరీ గ్యాప్ ఎక్కువైతే బజ్ పై ప్రభావం పడుతుంది. కాబట్టి 2023 ఎండింగ్ కల్లా 'సలార్' తప్పక రిలీజ్ అవుతుందన్నది ఓ కాన్పిడెన్స్. ఈ నేపథ్యంలో దసరా..క్రిస్మస్..దీపావళి లాంటి పండగ సీజన్లు టార్గెట్ చేస్తే గనుక మిగతా రిలీజ్ లపై సలార్ ప్రభావం ఉంటుంది. అయితే దీపావళి కానుకగా ఇప్పటికే సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' రిలీజ్ లాక్ అయి ఉంది. ఆతేదీకి సలార్ వచ్చే అవకాశం ఉందని నెట్టింట గట్టి ప్రచారం సాగుతోంది.
అదే జరిగితే టైగర్ వర్సస్ సలార్ మధ్య వార్ తప్పదు. సల్మాన్ సినిమా అయితే వాయిదా వేసే అవకాశం ఉండదు. ఎన్ని సినిమాలొచ్చినా సల్మాన్ తగ్గే సీన్ ఉండదు. ఒకవేళ అదే జరిగితే హిందీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల మధ్య యుద్దం తప్పదు. హిదీలో ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమా లంటే అభిమానించే నార్త్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.
ఇక సల్మాన్ సొంత భాష అదే కాబ్టటి ఆయనకు ఎలాగూ తిరుగుండదు. హిట్ టాక్ వచ్చిందంటే సక్సెస్ నల్లేరు మీద నడకలాంటిది. కానీ సలార్ ఎలాంటి ఫేజ్ లోనైనా హిందీ మార్కెట్ లో నెట్టుకు రావాల్సి ఉంటుంది. మరి సలార్ ఇలాంటి సమీకరణాలన్ని దృష్టిలో పెట్టుకుంటారా? వాటికి అతీతంగా పక్కోడి మంచి కూడా కోరుకుని ఎవరికీ ఇబ్బంది కలగని సమయంలో రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి.