వెయిట్ అండ్ వెయిట్... 'సలార్' ఇంకా రింగులోకి దిగలే!
టాలీవుడ్ మీడియా ఈ విషయంలో ఎంతో బ్యాలెన్స్ వ్యవహరిస్తోంది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం కాస్త అతి చేస్తున్నట్లే కనిపిస్తోంది
By: Tupaki Desk | 19 Dec 2023 12:30 AM GMT'సలార్'..'డంకీ' చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న డంకీ రిలీజ్ అవుతుంటే..ఆ మరుసటి రోజును సలార్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాలని ఉద్దేశించి మీడియాలో హైప్ భారీ ఎత్తున క్రియేట్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఎవరు పై చేయి సాధిస్తారు? నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ ఉంటుందా? అన్నట్లు సన్నివేశం కనిపిస్తోంది.
టాలీవుడ్ మీడియా ఈ విషయంలో ఎంతో బ్యాలెన్స్ వ్యవహరిస్తోంది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం కాస్త అతి చేస్తున్నట్లే కనిపిస్తోంది. రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ని కంపారిజన్ చేస్తూ డంకీదే అప్పర్ హ్యాండ్ అంటూ కొత్త ప్రచారం తెరపైకి తెస్తుంది. ఇదెలా ఉందంటే? ఆలు లేదు...సూలు లేదు..అల్లుడు పేరు అదేదో అన్నట్లే! సన్నివేశం కనిపిస్తుంది. 'సలార్' తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కేవలం ఓవర్సీస్ లోనే ఓపెన్ అయ్యాయి. ఆ లెక్కలన్ని నిశితంగా పరిశీలించకుండానే బలీవుడ్ మీడియా డంకీని ఆకాశానికి ఎత్తేయడం ఆశ్చర్యకరం.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 'సలార్' గురించి డార్లింగ్ ప్రభాస్ ఇంకా మీడియా ముందుకు రాలేదు.కేవలం ప్రశాంత్ నీల్...చిత్ర నిర్మాత చేస్తోన్న ప్రచారం మినహా ప్రభాస్ మీడియా ముందుకొస్తే సన్నివేశం మరోలా ఉంటుంది. మరోవైపు డంకీ గురించి షారుక్ ఖాన్ ఏ రేంజ్ లో వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నాడో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. హిందీలో తన సినిమా టికెట్లు కోనాలం టూ..వ్యక్తిగతంగా ఈసినిమాని తానెంత ప్రేమించి చేసానని అభిమానులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
'డంకీ' చిత్రాన్ని అభిమానుల నరనరాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. డార్లింగ్ మాత్రం ఇంకా సీన్ లోకి రాలేదు. అలా రాకుండానే ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. నేరుగా రంగంలోకి దిగితే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన 'సలార్' ట్రైలర్ మార్కెట్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో కళ్ల ముందు కనిపిస్తునే ఉంది.