ఇంకా 32రోజులే.. ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఒకటే గుబులు
సలార్ ని కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందించడానికి ఏ విషయంలోను రాజీకి రాలేదని టాక్ వినిపిస్తోంది
By: Tupaki Desk | 26 Aug 2023 3:51 AM GMTకేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్: పార్ట్ 1 (సీజ్ ఫైర్) విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఈ సినిమా టీజర్ ఇంతకుముందు విడుదలై అంతర్జాల వీక్షణల్లో రికార్డులు సృష్టించింది. సలార్ కి అమాంతం హైప్ పెంచడంలో ఇది సహకరించింది. దానికి తగ్గట్టే ప్రీరిలీజ్ బిజినెస్ లో సలార్ దూకుడు కొనసాగుతోందని ట్రేడ్ చెబుతోంది. 2023 మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుదలకు సిద్ధమవుతున్న సలార్ భారతదేశంలోని అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. USAలో 4,456 ప్రీమియర్ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయంతో ఇప్పటివరకు 1,28,980 డాలర్ల గ్రాస్ వసూలు చేసిందని రిపోర్ట్ అందింది. రిలీజ్ కి నెల రోజుల ముందే అమెరికాలో 1మిలియన్ డాలర్ క్లబ్ లో ఈ సినిమా చేరడం ఒక సంచలనం. భారతదేశంలో అతిపెద్ద పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అతిపెద్ద యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న సినిమాగా సలార్: పార్ట్ 1 పై హైప్ పరాకాష్ఠకు చేరుకుంది.
ఈ మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన టికెట్ లు విడుదలకు 32 రోజుల ముందే డల్లాస్‌లో పూర్తిగా అమ్ముడుపోవడం హైప్ ని ఎలివేట్ చేస్తోంది. ఈ చిత్రం పెద్ద స్క్రీన్లలోకి రావడానికి కేవలం 32 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున విడుదలకు కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. 32రోజుల్లో సలార్ రిలీజ్.. ఈ మాట ప్రభాస్ అభిమానుల గుండెల్లో గుబులు పెంచుతోంది. ప్రేక్షకులలో అంతకంతకు ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతోంది.
సలార్ ని కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందించడానికి ఏ విషయంలోను రాజీకి రాలేదని టాక్ వినిపిస్తోంది. ఇండియా బెస్ట్ యాక్షన్ చిత్రాల్లో ఒకటిగా సలార్ నిలిపేందుకు అతడు ప్రయత్నించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని అత్యంత భారీగా విడుదల చేయడం ద్వారా ప్రభాస్ రేంజును మరింత పెంచనున్నారు. విడుదలైన అన్నిచోట్లా రికార్డులను సృష్టించేందుకు ఆస్కారం ఉందన్న చర్చా సాగుతోంది.
సలార్ తో మునుపెన్నడూ చూడని యాక్షన్ థ్రిల్స్ ని ఎంజాయ్ చేస్తారని చిత్రబృందం చెబుతోంది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం 28 సెప్టెంబర్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడం సహా ఆంగ్లంలోను ఈ చిత్రం విడుదలవుతుందని తెలుస్తోంది.