ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ.. ఓ బ్యాడ్ న్యూస్!
ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాజా సాబ్ కంప్లీట్ చేయనున్నారు.
By: Tupaki Desk | 24 March 2024 2:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కల్కి చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మే9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాజా సాబ్ కంప్లీట్ చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది.
అయితే బాహుబలి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సిల్వర్ జూబ్లీ అంటే మూవీ నేమ్ కాదండి.. 25వ సినిమా అని అర్థం. ఈ మూవీ కోసం స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి పనిచేయనున్నారు ప్రభాస్. ఏడాది క్రితమే స్పిరిట్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
కల్కి సినిమా పూర్తి చేశాక స్పిరిట్ సెట్స్ లో ప్రభాస్ అడుగుపెట్టనున్నారని అంతా ఫిక్సయ్యారు. 2024 వేసవిలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్దనుకుంటే.. ఏడాది చివరలో స్పిరిట్ మూవీ మొదలుపెడతానని సందీప్ ఇటీవల చెప్పారు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకాస్త సమయం పడుతుందట. 2025 స్టార్టింగ్ లో మొదలవ్వనుందని తెలుస్తోంది. అందుకు కారణం సందీప్ రెడ్డేనట.
ఇటీవల యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్.. ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. మొత్తం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల టైమ్ పడుతుందట. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయనున్నారట. కాబట్టి ఇదంతా పూర్తయ్యేసరికి 2024 అయిపోతుందని చెబుతున్నారు. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కంప్లీట్ చెయ్ సందీప్ అన్న అని అంటున్నారు.
ఇక స్పిరిట్ మూవీ విషయానికి వస్తే.. ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. డార్లింగ్ ఇప్పటివరకు కెరీర్ లో పోలీస్ రోల్ చేయలేదు. దీంతో ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.