Begin typing your search above and press return to search.

స్పిరిట్.. సందీప్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 9:30 AM GMT
స్పిరిట్.. సందీప్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లానింగ్ చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. సలార్, కల్కి 2898ఏడీ వంటి భారీ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ప్రభాస్, ఈ ఏడాదిలో ఒక్క సినిమాతో మాత్రమే అభిమానులను అలరించగలిగాడు. అయితే, రాబోయే కాలంలో మాత్రం ప్రభాస్ నుండి మరిన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కల్కి 2898ఏడీ పార్ట్ 2 సినిమా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో న్యూ ప్రాజెక్ట్ ను లాంచ్ చేశాడు.

మరొకవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా ప్రభాస్ చేయనున్నాడు. ఆ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇందులో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో ప్రాజెక్ట్‌ను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉంటుందని, ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఇండియా కాలంలో సైనికుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి రెండు కూడా పవర్ ఫుల్ పాత్రలు కావడంతో, ప్రభాస్ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అలాగే, సోల్జర్ పాత్రలో ఆయన నటన కూడా మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఉండాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సందీప్ రెడ్డి స్పిరిట్ ప్రాజెక్టు వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఇక సినిమాను ఏడాదిలో ఫినిష్ చేయాలని దర్శకుడు ఒక ప్లాన్ సెట్ చేసుకునే ప్రయత్నం చేసున్నాడట. అంటే సినిమాను 2026 లోనే వీలైనంత తొందరగా ఆడియెన్స్ ముందుకు తీసుకు రావచ్చని తెలుస్తోంది. దీంతో పాటు ప్రభాస్ హను షూటింగ్ ఒకేసారి చేయనున్నట్లు సమాచారం.

ఎందుకంటే, ఈ రెండు చిత్రాలలో ఆయన లుక్ దాదాపుగా ఒకే విధంగా ఉండొచ్చని టాక్. ఒకేసారి షూటింగ్ పూర్తిచేయడం వల్ల ప్రభాస్ కు మరింత సులువుగా ఉండబోతోందట. ఇక కల్కి 2898ఏడీ పార్ట్ 2 వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కానుందనేది మరో వార్త. ఇక సలార్ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ప్రభాస్ తన ప్లానింగ్‌ను సక్రమంగా చేసుకుంటూ, అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాడు.