ప్రభాస్.. ఆ సినిమా ఆలస్యం కాదట
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ స్క్రిప్ట్ పైన ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా వర్క్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 1 March 2024 4:11 AM GMTడార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టాడు. ఏడాదికి రెండు సినిమాలు ప్రేక్షకులకి అందించాలనే లక్ష్యం ఉన్నాడు. ఆ దిశగానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కి 2898ఏడీ మూవీ మే నెలలో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తూ ఉన్నారు.
ఈ సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దీని తర్వాత ఈ ఏడాది ఆఖరులో మారుతి దర్శకత్వంలో సిద్ధం అవుతోన్న రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. సలార్ పార్ట్ 2 వచ్చే ఏడాదిలో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ స్క్రిప్ట్ పైన ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉంటే తాజాగా సందీప్ రెడ్డి వంగా ఈ మూవీపై క్లారిటీ ఇచ్చాడు. ఓ ప్రెస్ మీట్ లో స్పిరిట్ మూవీ స్టొరీలైన్ గురించి మీడియాకి చెప్పారు.
అలాగే మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ అవుతుందని స్పష్టం చేశాడు. స్పిరిట్ మూవీ కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. స్పిరిట్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం అవుతోందని తెలియజేశాడు. అంటే అన్ని కరెక్ట్ గా సెట్ అయితే స్పిరిట్ మూవీని వచ్చే ఏడాది ఆఖరులో లేదంటే 2025లో సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో నెక్స్ట్ లెవల్ హీరోయిజం చూపించిన సందీప్ రెడ్డి వంగా మొదటి సారి ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ గా రిప్రజెంట్ చేయబోతున్నాడు. అది కూడా పవర్ ఫుల్ యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్ లో ప్రభాస్ స్పిరిట్ మూవీలో కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో స్పిరిట్ మూవీపైన హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ప్రభాస్ ఖాతాలో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ స్పిరిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.