ప్రభాస్ vs ఎన్టీఆర్.. వార్ సెట్టయితే..?
ఒక వేళ ప్రభాస్ స్పిరిట్ తో, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో 2026 సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తే టఫ్ ఫైట్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By: Tupaki Desk | 11 Aug 2024 4:22 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ఉన్నాడు. అతని సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో యూనివర్సల్ కథలతోనే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఏకంగా ఐదు సినిమాల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా బ్యాక్ టూ బ్యాక్ రానున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది రాజాసాబ్ మూవీ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథతో ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించబోతున్నారంట. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా స్పిరిట్ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ట్ అయిన డ్రాగన్ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. మరోసారి ప్రశాంత్ నీల్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథతోనే డ్రాగన్ మూవీని చేయబోతున్నారు. అయితే కథలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది మాత్రం క్లారిటీ లేదు. 2026 జనవరి 9న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అంటే సంక్రాంతి కానుకగా రానుందని అర్ధమవుతోంది.
కచ్చితంగా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపైన కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఒక వేళ ప్రభాస్ స్పిరిట్ తో, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో 2026 సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తే టఫ్ ఫైట్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే సారి వచ్చే అవకాశం ఉండకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది.
ఒకవేళ వస్తే మాత్రం ప్రభాస్ స్పిరిట్ సినిమాకి ఎక్కువ ప్రేక్షకాదరణ లభించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. కచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గొచ్చని భావిస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్ ని వినియోగించుకోవాలని పోటీ పడితే మాత్రం డ్రాగన్ సినిమాపై ఎఫెక్ట్ పడొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.