అప్పటి వరకు రెస్ట్‌లోనే ప్రభాస్.. ఎందుకంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం యూరోప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడా శస్త్రచికిత్స్ విజయవంతంగా పూర్తైనట్లు తెలిసింది.
By: Tupaki Desk | 27 Sep 2023 4:46 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం యూరోప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడా శస్త్రచికిత్స్ విజయవంతంగా పూర్తైనట్లు తెలిసింది. దీంతో కొంతకాలం పాటు డార్లింగ్ రెస్ట్ తీసుకోబోతున్నారట. దాదాపు అక్టోబర్ నెల మొత్తం ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. నవంబర్ నుంచి తిరిగి సెట్స్‌లోకి అడుగుపెడతారట.
వాస్తవానికి ప్రభాస్ చాలా కాలం నుంచే మోకాలి గాయంతో బాధపడుతున్నారు. ఆదిపురుష్ ప్రమోషన్స్ సమయంలోనే ఆయన నడిచే విధానంలో తేడా కనిపించింది. దీంతో ఆయన అభిమానులంతా ఎంతో బాధపడ్డారు. అయినా అప్పటి నుంచి గాయంతోనే షూటింగ్స్‌లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే ఆ సమయంలోనూ సర్జరీ కోసం ప్రభాస్ ఫారెన్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయ.
అయితే ఇప్పుడు ఎట్టకేలకు సలార్ మూవీ చిత్రీకరణ పూర్తైన తర్వాత ప్రభాస్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత ప్రభాస్.. నాగ అశ్విన్ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ , మారుతి హారర్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారట. ఈ రెండింటిలో కల్కికి ఎక్కువగా డేట్స్ ఇచ్చి త్వరగా పూర్తి చేస్తారట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అనంతరం ఈ రెండు చిత్రాలు పూర్తైన తర్వాత మళ్లీ ఒకేసారి రెండు చిత్రాలను సెట్స్‌పైకి తీసుకెళ్తారట ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడితో ఓ ప్రేమ కథా చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. 2024 వేసవి తర్వాతే వీటిని పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు బయట కథనాలు వస్తున్నాయి.
ఇకపోతే ప్రభాస్ పెళ్లి విషయం గురించి కూడా మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది తప్పకుండా చేసుకుంటారని డార్లింగ్ కుటంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చూడాలి మరి ప్రభాస్ ఏం చేస్తారో..