Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ (X) క‌మ‌ల్.. ఎవ‌రు ఆ డెవిల్?

తాజా స‌మాచారం మేర‌కు ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ వచ్చే వారంలో ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం.

By:  Tupaki Desk   |   18 Sep 2023 4:36 AM GMT

ప్రభాస్- కమల్ హాస‌న్ - అమితాబ్ బచ్చన్ అసాధార‌ణ‌ క‌ల‌యిక‌లో కల్కి 3898 AD (ప్రాజెక్ట్ కె) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కాంబినేష‌న్ తోనే హీట్ పుట్టించిన ద‌ర్శ‌కుడు టైటిల్ తో స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను పెంచాడు. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త‌దేశంలో రాని ఒక స‌రికొత్త కాన్సెప్టుతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. వ‌ర‌ల్డ్ బెస్ట్ టెక్నీషియ‌న్లు ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు.

ప్ర‌భాస్ కెరీర్ లో 'కల్కి 3898 AD'కి అత్యంత భారీ చిత్రంగా నిల‌వ‌నుంది. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ వ‌ర్సెస్ క‌మ‌ల్ హాస‌న్ ఎపిసోడ్స్ ప్ర‌ధాన హైలైట్ గా ఉంటాయ‌ని కూడా ఇప్ప‌టికే హింట్ అందింది. తాజా స‌మాచారం మేర‌కు ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ వచ్చే వారంలో ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం.

ప్రభాస్ 15 రోజుల సెలవుపై విదేశాలకు వెళ్లగా, కమల్ హాసన్ పై స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తార‌ని వీటికి ప్ర‌భాస్ అవసరం లేద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ విలన్‌గా నటించనున్నారు. సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్‌లలో కమల్ బ‌ల్క్ గా కాల్షీట్లు ఇచ్చార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ వ‌ర్సెస్ క‌మ‌ల్ హాస‌న్ ఎపిసోడ్స్ ని కూడా తెర‌కెక్కించాల్సి ఉంద‌ని తెలుస్తోంది.

క‌ల్కి చిత్రానికి సంబంధించిన ఎలాంటి లీకులు లేక‌పోవ‌డంతో అభిమానుల్లో క్యూరియాసిటీ అంత‌కంత‌కు పెరుగుతోంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ క‌నీసం పోస్ట‌ర్ లేదా వీడియో గ్లింప్స్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేస్తుంద‌ని ఆశ‌గా వేచి చూస్తున్నారు.

కానీ దీనికి సంబంధించి ఎలాంటి లీకులు అంద‌కుండా చిత్ర‌బృందం జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ నాగ్ అశ్విన్ బృందం గోప్య‌త పాటిస్తోంది. ఇక ఇదే చిత్రంలో దీపిక పాత్ర కూడా యాక్ష‌న్ క్వీన్ ని త‌ల‌పిస్తుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ కే గురించి చాలా విష‌యాలు ఒక భారీ ప్రెస్ మీట్ లో నాగ్ అశ్విన్ బృందం తెలియ‌జేసేందుకు ఆస్కారం ఉంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.