Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ సుభాస్ చంద్రబోస్ కొత్త డేట్

ఇప్పటికే యానిమల్ దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ ను చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 6:13 AM GMT
ప్రభాస్‌ సుభాస్ చంద్రబోస్   కొత్త డేట్
X

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ సలార్‌ మరియు కల్కి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్‌ తదుపరి సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. మొదటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు సలార్‌ 2 మరియు కల్కి 2 సినిమాలు కూడా లైన్‌ లో ఉన్నాయి. ఇప్పటికే యానిమల్ దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ ను చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగానే వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీని హను రాఘవపూడి దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి గత చిత్రం సీతారామం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంతకు మించి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ మరియు హనురాఘవపూడి కాంబో మూవీకి 'ఫౌజి' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా సుభాష్ చంద్రబోస్‌ కథ ఇన్‌పుట్స్ ను ఈ సినిమాలో వాడబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

యుద్ధం నేపథ్యంలో సాగే ఫౌజి లో మంచి ప్రేమ కథను కూడా దర్శకుడు హను రాఘవపూడి జోడించే అవకాశాలు ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా పట్టాల పైకి వెళ్లే సమయం వచ్చింది. సినీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్టు 17న సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఫౌజి సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం పట్టక పోవచ్చని, వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రావచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం సీతారామం లో హీరోయిన్‌ గా నటించిన మృణాల్‌ ఠాకూర్ ను ఈ సినిమా కి హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ విషయం పై ఇప్పటి వరకు అధికారిక క్లారిటీ రాలేదు. ఫౌజి సినిమా కోసం ఆర్మీ ఆఫీసర్‌ గా కనిపించబోతున్న ప్రభాస్‌ ఇప్పటికే హోం వర్క్ మొదలు పెట్టాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ భారీ విజయాలు సొంతం చేసుకుంటున్న ఈ సమయంలో హను రాఘవపూడి వంటి విభిన్న చిత్రాల దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయడం అనేది కచ్చితంగా మంచి పరిణామం. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తేనే ప్రభాస్ వంటి స్టార్‌ స్థాయి మరింతగా పెరుగుతుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాలు, కమిట్‌ అయిన సినిమాల్లో అన్నింటికంటే కూడా ఫౌజి పై ఆయన ఫ్యాన్స్ దృష్టి ఎక్కువ ఉండే అవకాశం ఉంది.