Begin typing your search above and press return to search.

'ఫౌజీ' హను క్లాస్ + ప్రభాస్ మాస్!

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   30 July 2024 5:30 PM GMT
ఫౌజీ  హను క్లాస్ + ప్రభాస్ మాస్!
X

'కల్కి 2898 AD' సక్సెస్ జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో బ్యాక్ డ్రాప్ ఇదని, ఫలానా హీరోయిన్ ను తీసుకుంటున్నారని, ప్రభాస్ క్యారక్టర్ ఇలా ఉంటుందంటూ ఈ సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

హను రాఘవపూడి గతంలో 'అందాల రాక్షసి' 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'పడి పడి లేచెను మనసు' వంటి సెన్సిబుల్ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు. మధ్యలో వచ్చిన 'లై' మూవీ ప్లాప్ అవ్వడం.. చివరగా 'సీతారామం' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో క్లాస్ డైరెక్టర్ గానే జనాలకు గుర్తుండి పోయారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ తో ప్యూర్ క్లాస్ మూవీనే తీస్తారని అందరూ భావించారు. కానీ దర్శకుడు ఈసారి తన రూటు మారుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో హను రాఘవపూడి కాస్త క్లాస్ ట‌చ్ ఉన్న మాస్ సినిమా రూపొందించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదొక పీరియడ్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంది. యుద్ధ నేపథ్యంలో హను మార్క్ అందమైన ప్రేమకథను మిళితం చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇందులో ప్రభాస్ నుంచి అభిమానులు ఆశించే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కు కొదువ ఉండదని అంటున్నారు. అంతేకాదు రెబల్ స్టార్ సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేస్తారని అనుకుంటున్నారు.

ప్రభాస్, హను రాఘవపూడిల చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు జరిగే ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తారని సమాచారం. మృణాళ్ ఠాకూర్ తో పాటుగా పాకిస్తానీ నటి సజల్ అలీని హీరోయిన్లుగా తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటల కంపోజింగ్ కూడా అయిపోయింది.

ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన సెట్స్ ను నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఫౌజీ' మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.