Begin typing your search above and press return to search.

ప్రభాస్.. స్టోరీ లైన్ లో 'ఫౌజీ'?

2025 సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 July 2024 5:13 AM GMT
ప్రభాస్.. స్టోరీ లైన్ లో ఫౌజీ?
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నారు. నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. అన్నింటికంటే ముందుగా మారుతి చేస్తోన్న రాజాసాబ్ చిత్రం థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 2025 సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్ కాకుండా ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

వాటిలో కల్కి మూవీ సీక్వెల్ ఒకటి కాగా సలార్ పార్ట్ 2 కూడా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా డార్లింగ్ ప్రభాస్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా కూడా లైన్ లో ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ కథ సెకండ్ వరల్డ్ వైడ్ నేపథ్యంలో ఉంటుందంట. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరొక ఆసక్తికరమైన లీక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథగా ఫౌజీ హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ ఉండేలా హను రాఘవపూడి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సుభాష్ చంద్రబోస్ టైమ్ పీరియడ్ లో ఈ సినిమా కథ కొనసాగుతుందట. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు బోస్ ఉన్న టైమ్ లోనే ప్రభాస్ అందులో ఒక సైనికుడిగా కనిపిస్తాడట. ఈ ఒక్క లైన్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పవచ్చు.

వార్ నేపథ్యంలో నడిచే ప్రేమకథని ఈ చిత్రంలో హను రాఘవపూడి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్పిరిట్ కంటే ముందుగాను హను రాఘవపూడి సినిమాని ప్రభాస్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడంట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆగష్టు 22న ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ చేస్తారని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ని వేశారంట. ఈ సెట్ లోనే మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఫౌజీ అనే పేరుని పరిశీలిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందంట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కూడా షూటింగ్ రోజునే రివీల్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

రాజాసాబ్ తో పాటుగా ఫౌజీ సినిమాని సమాంతరంగా పూర్తి చేసేలా డార్లింగ్ ప్రభాస్ ప్లానింగ్ చేసుకుంటున్నారంట. ఈ ఏడాది ఆఖరులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పూర్తి చేయాల్సిన సలార్ 2ని ప్రభాస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడనేది క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్తారనే టాక్ నడుస్తోంది.