Begin typing your search above and press return to search.

ఆపరేషన్ వాలంటైన్.. ప్రభవించే రవిరాజువే..

ఆపరేషన్ వాలంటైన్ సినిమా మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఇంకో సాంగ్ ని రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 9:10 AM GMT
ఆపరేషన్ వాలంటైన్.. ప్రభవించే రవిరాజువే..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆపరేషన్ వాలంటైన్ మూవీ. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మార్చి 1న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో వస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మొదట్లోనే సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా మానుషీ చిల్లర్ నటిస్తోంది.

పుల్వామా ఘటన తర్వాత జరిగిన పాకిస్థాన్ పై చేసిన ఎయిర్ స్ట్రైక్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతోంది. మిక్కీ జె మియర్ సినిమాకి సంగీతం అందించాడు. సోనీ పిక్చర్స్ తో కలిపి సందీప్ ముద్దా ఈ సినిమాని నిర్మించారు. తెలుగు, హిందీ భాషలలో సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఆపరేషన్ వాలంటైన్ సినిమా మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఇంకో సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రభవించే రవిరాజువే.. అంటూ సాగే ఈ సాంగ్ వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఈ పాటని రామజోగయ్య శాస్త్రీ రాయగా అనురాగ్ కశ్యప్ ఆలపించారు. సాంగ్ మంచి ఉత్తేజకరంగా ఉండటం విశేషం.

ఈ సాంగ్ కి యుట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో హీరోయిక్ ఎలివేషన్, దేశభక్తి సాంగ్స్ బాగా క్లిక్ అవుతాయి. అలాగే ఈ సాంగ్ కి కూడా స్పందన వస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి సరిపోయే పెర్ఫెక్ట్ స్టోరీగానే ఆపరేషన్ వాలంటైన్ ఉండబోతోందని తెలుస్తోంది. గని, గాండీవదారి అర్జున సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకోవాలని వరుణ్ తేజ్ అనుకుంటున్నారు.

ఈ మూవీ హిట్ అయితే హిందీలో కూడా వరుణ్ తేజ్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కథలని నార్త్ ఇండియన్ ఆడియన్స్ బాగానే ఆదరిస్తారు. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీ ఫలితం ఎలా ఉండబోతోంది తెలియాలంటే మరొక్క రోజు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 17 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే 18 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క. పోటీగా ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సాలీడ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.