Begin typing your search above and press return to search.

ప్రభాస్ ప్లానింగ్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడుకి ఫ్యాన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. మొన్నటిదాకా సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:02 AM GMT
ప్రభాస్ ప్లానింగ్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడుకి ఫ్యాన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. మొన్నటిదాకా సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటి సినిమాలు ఎప్పుడో అని కంగారు పడిన ఫ్యాన్స్ ప్రభాస్ ప్లానింగ్ చూసి వావ్ అనేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ 1 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసిన ప్రభాస్ ఈ ఇయర్ కూడా రెండు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి సినిమా మే 9న రిలీజ్ లాక్ చేసిన విషయం తెలిసిందే.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల దాకా బడ్జెట్ పెట్టిన కల్కి సినిమాపై రెబల్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రభాస్ కు గుర్తింపు తెచ్చేలా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా రాజా సాబ్ అని ఫైనల్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. సన్ర్కాంతి కానుకగా ఈ సినిమా నుంచి కూడా ఫస్ట్ గ్లింప్స్ వదిలే ఛాన్స్ లు ఉన్నాయి.

2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రభాస్ 3 సినిమాలు రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ 2023 డిసెంబర్ 22న సలార్ 1 రిలీజ్ కాగా.. 2024 మే 9న కల్కి వస్తుంది. ఇక ఈ ఇయర్ డిసెంబర్ కల్లా మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. కల్కి, రాజా సాబ్ రెండు డిఫరెంట్ సినిమాలు. కల్కి లార్జ్ స్కేల్ లో భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమాలో దీపిక, అమితాబ్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటుగా లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి మహా నటుడు కూడా ఉన్నాడు.

ఇక మారుతి సినిమా విషయానికి వస్తే రాజా డీలక్స్ అనే థియేటర్ ని కాపాడుకునే పాత్రలో హీరో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాజా సాబ్ వస్తుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ స్టామినా చూపించేలా రాబోతున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ వంగా స్పిరిట్ లైన్ లో ఉంది