ప్రదీప్ మాచిరాజు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ టాక్..!
ప్రదీప్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శక ద్వయం నితిన్ భరత్ లు డైరెక్ట్ చేశారు.
By: Tupaki Desk | 31 March 2025 12:30 PMయాంకర్ గా సూపర్ సక్సెస్ అయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా చేసిన తొలి ప్రయత్నం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ తన రెండో సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఫైనల్ ఆ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ప్రదీప్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శక ద్వయం నితిన్ భరత్ లు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మరో యాంకర్ దీపిక పిల్లి నటించింది.
రీసెంట్ గా రిలీజైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీజర్ ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో మెట్రో పాలిటిన్ సిటీకి ప్రాజెక్ట్ పని మీద వెళ్తాడు హీరో. అక్కడ అతని చెప్పిన పని మాత్రమే చేసే ఓని వాళ్లు. ఆ ఊళ్లో ఒక పెద్ద మనిషి అతనికి ఒక కూతురు. ఆ ఊళ్లో ఉన్న వాళ్లంతా ఆమెను ప్రేమలో పడేయాలని ట్రై చేస్తారు.
కట్ చేస్తే ఒక సందర్భంలో ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఈ 60 మందిలోనే ఒకరు తన కూతురిని పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఇంతకీ అసలు ఆ ఊరి కథ ఏంటి.. హీరో అక్కడికి వేళ్లి ఏం చేశాడు అన్న కథతోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రదీప్ మాచిరాజు మార్క్ కామెడీ ఎంటెర్టైనర్ గా ఉంది. ఈ రోం కాం ఎంటర్టైనర్ ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.
యాంకర్ గా తనకు స్మాల్ స్క్రీన్ పై ఉన్న ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా సినిమాల్లో కూడా వాడుతున్నాడు ప్రదీప్. సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఎక్కువే అన్నట్టుగా కనిపిస్తుంది. రథన్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉండేలా ఉన్నాయి. తొలి సినిమా తర్వాత రెండో ప్రయత్నానికి చాలా గ్యాప్ తీసుకున్న ప్రదీప్ ఒక మంచి ప్రాజెక్ట్ తోనే వస్తున్నారని చెప్పొచ్చు. ప్రదీప్ తో పాటుగా సత్య, దీపిక పిల్లి కూడా అలరించేలా ఉన్నారు.
ఏప్రిల్ 11న రిలీజ్ అవుతున్న ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ట్రైలర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. బుల్లితెర మీద యాంకర్స్ గా అలరించిన ప్రదీప్, దీపిక ఇలా ఒక సినిమాలో కలిసి నటించడం కూడా స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది.