యూఎస్ లో ప్రదీప్ ఫ్యామిలీ హిలారియస్ జర్నీ.. ఫుల్ రిఫ్రెషింగ్ గా..
నిజజీవిత ఘటనల ఆధారంగా ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్ బర్గ్ సిరీస్ ను విజల్ పాటిల్ రూపొందించారు.
By: Tupaki Desk | 24 Oct 2024 4:07 PM GMTప్రతివారం ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతాయన్న విషయం తెలిసిందే. కొన్ని మంచి రెస్పాన్స్ అందుకోగా.. మరికొన్ని అనుకున్న స్థాయిలో అలరించలేవు. ఇంకొన్ని మాత్రం వేరే లెవెల్ లో రెస్పాన్స్ దక్కించుకుని దూసుకుపోతాయి. గత వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్ బర్గ్ సీజన్-1.. ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
నిజజీవిత ఘటనల ఆధారంగా ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్ బర్గ్ సిరీస్ ను విజల్ పాటిల్ రూపొందించారు. అమెరికా వెళ్లిన ఓ ఇండియన్ ఫ్యామిలీ పడిన కష్టాల చుట్టూ సిరీస్ అంతా తిరుగుతుంది. అహ్మదాబాద్ కు చెందిన మహేష్ ప్రదీప్ (నవీన్ ఆండ్రూస్) రాకెట్ భాగాల తయారీకి స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకున్న తర్వాత పిట్స్ బర్గ్ కు తన కుటుంబంతో వెళ్తారు. ఆయన భార్య సుధ (సింధు వీ).. అమెరికాలో మెడికల్ ప్రాక్టీస్ చేద్దామనుకుంటారు.
కానీ ఆమెకు లైసెన్స్ రావడం లేట్ అవుతుంటోంది. ప్రదీప్, సుధ ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆ సమయంలో వారి కూతురు భాను.. స్టూ అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అదే సమయంలో స్టూ ఇల్లు.. కాలిపోతుంది. దీంతో వారి కుటుంబం.. ప్రదీప్ ఫ్యామిలీని నిందిస్తుంది. దీంతో నిజాన్ని వెలికితీసేందుకు, యూఎస్ నుంచి బహిష్కరించాలా వద్దా అని నిర్ధరించడానికి ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు ప్రదీప్ ఫ్యామిలీని పిలిపిస్తారు.
అయితే తమ కామెడీతో సిరీస్ లో ప్రదీప్ కుటుంబసభ్యులు ఓ రేంజ్ లో అలరిస్తారు. తమ మాటలతో నవ్విస్తారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యంగా అనిపించకుండా సిరీస్ మొత్తాన్ని డీల్ చేస్తారు. వారిలో వారు మాట్లాడుకునే తీరు.. వేరే లెవెల్ లో నవ్విస్తుంది. సుధగా సింధు వీ అద్భుతంగా నటించారు. స్టైలిష్ డైలాగ్ డెలివరీతో మెప్పించారు. నవీన్ ఆండ్రూస్.. ఈ సిరీస్ లో తన టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టారు.
కుటుంబసమేతంగా యూఎస్ చేరుకున్నప్పుడు వారి పేర్లను ఇమ్మిగ్రేషన్ అధికారిని పలికే తీరు.. ఫుల్ కామెడీగా ఉంటుంది. కామెడీ, ఎమోషన్స్ ను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ విజల్ పాటిల్ బాగా తెరకెక్కించారు. మంచి కాన్సెప్ట్ తో మెప్పించారు. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు. వాస్తవ సమస్యలకు కామెడీని యాడ్ చేసి రూపొందించారు. ఓవరాల్ గా సిరీస్ అంతా రిఫ్రెష్ గా అనిపిస్తుంది. మరి ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్ బర్గ్ సిరీస్ ను మీరు చూశారా?