Begin typing your search above and press return to search.

యూత్ స్టార్ మరోటి మొదలు పెట్టాడోచ్..!

యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ అదరగొట్టేస్తున్న ప్రదీప్ రంగనాథ్ తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా లాంచ్ చేశారు.

By:  Tupaki Desk   |   26 March 2025 2:23 PM
యూత్ స్టార్ మరోటి మొదలు పెట్టాడోచ్..!
X

తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ ముందు దర్శకుడిగా పరిచయమైనా ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని వరుస సక్సెస్ లు కొడుతున్నాడు. హీరోగా లవ్ టుడే తో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఈమధ్యనే డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ అదరగొట్టేస్తున్న ప్రదీప్ రంగనాథ్ తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా లాంచ్ చేశారు.


నూతన దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ షాట్ బూం అనే వీడియో రిలీజ్ చేశారు. ప్రదీప్ రంగనాథన్ ఫ్లైయ్యింగ్ కిస్ ఇస్తూ కనిపించాడు. మళ్లీ యూత్ ఆడియన్స్ మెచ్చే న్యూ ఏజ్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా రాబోతుందని అర్ధమవుతుంది. అంతేకాదు మైత్రి మేకర్స్ నిర్మాతలు కాబట్టి ప్రదీప్ కెరీర్ లో బిగ్ స్కేల్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తుంది.


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రేమలు బ్యూటీ మమితా బైజుని ఎంపిక చేశారు. ప్రదీప్ రంగనాథ్ కి మమితా బైజు పర్ఫెక్ట్ జోడీ అనిపించేలా ఈ సినిమా యూత్ ఆడియన్స్ టార్గెట్ తో తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో శరత్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది.


ఈ సినిమాకు సాయి అభ్యంకర్ అనే యువ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారు. యూత్ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ప్రదీప్ రంగనాథ్. అలాంటి ప్రదీప్ మైత్రి మేకర్స్ సినిమా చేయడం అది తెలుగు తమిళ బైలింగ్వల్ గా ప్లాన్ చేయడం ఆడియన్స్ ని కుషి చేస్తుంది. తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని మెప్పిస్తూ సూపర్ హిట్లు కొడుతున్న ప్రదీప్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. ప్రదీప్ రంగనాథ్ యూత్ కి నచ్చే సినిమాలు చేయడమే కాదు అందులో ఎంతోకొంత లైఫ్ మెసేజ్ కూడా ఇస్తున్నాడు. అందుకే అతని సినిమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.


ఇక ఒక హీరో వరుస హిట్లు కొడుతుంటే అతనితో సినిమాలు చేసేందుకు అందరు లైన్ కడతారు. అందుకే ప్రదీప్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. డ్రాగన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మేకర్స్ ఇప్పుడు ప్రదీప్ తో డైరెక్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. సో మరో యూత్ ఫుల్ హిట్ కి ప్రదీప్ రంగనాథ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారనే చెప్పొచ్చు.