Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు అనుకుంటే.. ఈ హీరో లేపేశాడు

‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ కొత్త చిత్రంగా ‘డ్రాగన్’ మూవీని ఎనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 2:30 PM GMT
ఎన్టీఆర్ కు అనుకుంటే.. ఈ హీరో లేపేశాడు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా ఈ పేరు వినిపిస్తోంది. అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మేగ్జిమమ్ ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేయోచ్చనే ప్రచారం నడుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఆసియా దేశాలని భయపెట్టిన మోస్ట్ వాంటెడ్ డాన్ కథతో ఈ మూవీ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.

వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకి ‘డ్రాగన్’ టైటిల్ రిజిస్టర్ చేయించారో లేదో కాని సడెన్ గా తమిళంలో ఒక హీరో ఇదే పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ కొత్త చిత్రంగా ‘డ్రాగన్’ మూవీని ఎనౌన్స్ చేశారు. ‘ఓ మై కడపులే’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో బస్సు టాప్ పైన లుంగీ కట్టుకొని ఉన్నాడు. అలాగే కళ్ళజోడు పెట్టుకొని స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఒల్లో బుక్స్ పెట్టుకొని కూర్చొని ఉండడంతో ప్రదీప్ రంగనాథ్ క్యారెక్టర్ కొత్తగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. బస్సు పైన వరస్టు స్టూడెంట్ అని రాసి ఉంది. ప్రతి కాలేజీలో లెక్చరర్లు అందరూ తిట్టుకునే స్టూడెంట్ ఒకడుంటాడు. పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఒకడి కథతోనే ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు పోస్టర్ బట్టి అర్ధమవుతోంది.

అయితే ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు ఎందుకు పెట్టారనేది క్లారిటీ లేదు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోందని ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి స్పష్టం అవుతోంది. ‘లవ్ టుడే’ యూత్ లవ్ స్టొరీని రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించి ప్రదీప్ రంగనాథ్ సక్సెస్ అందుకున్నాడు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సురెన్స్ కంపెనీ’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ కథాంశంతో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘డ్రాగన్’ టైటిల్ ని ప్రదీప్ రంగనాథ్ కొట్టేయడంతో ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి ఏ పేరు పెడతారా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇంకేదైనా పవర్ ఫుల్ టైటిల్ ని ఆలోచిస్తారా లేదంటే అదే పేరు కోసం ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.