Begin typing your search above and press return to search.

విజ‌యానికి మూడు సూత్రాలు చెప్పిన టాలెంటెడ్ హీరో!

తాజాగా హైద‌రాబాద్‌లో రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించింది చిత్ర యూనిట్. ఈ స‌క్సెస్ మీట్ లో ప్ర‌దీప్ త‌న బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కు గ‌ల సీక్రెట్ ను వెల్ల‌డించాడు.

By:  Tupaki Desk   |   4 March 2025 2:00 PM IST
విజ‌యానికి మూడు సూత్రాలు చెప్పిన టాలెంటెడ్ హీరో!
X

కోలీవుడ్ న్యూ టాలెంట్ ప్ర‌దీప్ రంగ‌నాథన్ స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు. మొద‌టి సినిమా ల‌వ్ టుడే తోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ప్ర‌దీప్, రీసెంట్ గా రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి మ‌రోసారి సూప‌ర్ హిట్ అందుకున్నాడు. కేవ‌లం 10 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా రూ.100 కోట్లు క‌లెక్ట్ చేసి ప్ర‌దీప్ హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తోంది.

తాజాగా హైద‌రాబాద్‌లో రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించింది చిత్ర యూనిట్. ఈ స‌క్సెస్ మీట్ లో ప్ర‌దీప్ త‌న బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కు గ‌ల సీక్రెట్ ను వెల్ల‌డించాడు. ఎప్పుడైనా సినిమాను జెన్యూన్ ఆలోచ‌న‌లు, స్ట్రాంగ్ ఎమోష‌న్స్ తో తెర‌కెక్కిస్తే అవి క‌చ్ఛితంగా ఆడియ‌న్స్ మ‌నసుల్ని గెలుస్తాయ‌ని త‌న న‌మ్మ‌కాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

డ్రాగ‌న్ మూవీ అంద‌రికీ రిలేట్ అయ్యేలా ఉంటుంద‌ని, ఎప్పుడైనా ఎమోష‌న్స్ ను నిజాయితీగా చూపిస్తే, భాష‌తో సంబంధం లేకుండా ఆడియ‌న్స్ క‌నెక్ట్ అవుతార‌ని.. ప్రేమ‌, స్నేహం, ఫ్యామిలీ ఈ మూడు డ్రాగ‌న్ ను సూప‌ర్‌హిట్ గా నిలిపాయ‌ని ప్ర‌దీప్ తెలిపాడు. డైరెక్ట‌ర్ అశ్వ‌త్ మారిముత్తు కూడా ఇదే విష‌యాన్ని చెప్తూ డ్రాగ‌న్ మూవీ ఎమోష‌న‌ల్ రోల‌ర్‌కోస్ట‌ర్ అని పేర్కొన్నాడు.

అయితే రెండు వ‌రుస హిట్లొచ్చాయ‌ని ప్ర‌దీప్ తీరిగ్గా వాటిని ఎంజాయ్ చేసి త‌ర్వాత నెక్ట్స్ సినిమాల గురించి చూడొచ్చులే అనుకోవ‌డం లేదు. ఆల్రెడీ ప్ర‌దీప్ త‌న త‌ర్వాతి సినిమాను లైన్ లో పెట్టాడు. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ కోసం ప్ర‌దీప్ రెడీ అవుతున్నారు. సై-ఫై రొమాంటిక్ కామెడీ జాన‌ర్ లో రూపొంద‌నున్న ఈ సినిమాను రౌడీ పిక్చ‌ర్స్ మ‌రియు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.

కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించ‌నున్న ఎల్ఐకెలో ఎస్జె సూర్య కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్ర‌దీప్ త‌న కెరీర్ ను చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో నుంచి ముందుముందు ఎలాంటి సినిమాలు రానున్నాయా అని చూడటానికి ఆడియ‌న్స్ సైతం వెయిట్ చేస్తున్నారు.