Begin typing your search above and press return to search.

కార్లు ఉన్న వాళ్ల‌కు కాదు లేని వాళ్ల‌కు ఇవ్వాలిలా!

ఇండస్ట్రీలో భారీ స‌క్సెస్ ఇస్తే నిర్మాత‌లు ఎలాంటి వ‌రాలు కురిపిస్తారు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   18 Feb 2025 6:21 AM GMT
కార్లు ఉన్న వాళ్ల‌కు కాదు లేని వాళ్ల‌కు ఇవ్వాలిలా!
X

ఇండస్ట్రీలో భారీ స‌క్సెస్ ఇస్తే నిర్మాత‌లు ఎలాంటి వ‌రాలు కురిపిస్తారు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. డైరెక్ట‌ర్ల‌కు ఖ‌రీదైన బ‌హుమ‌తిలిచ్చి బుట్ట‌లో వేసుకుంటారు. కోట్ల రూపాయ‌ల ఖ‌రీదు గ‌ల కార్లు..బంగ‌ళాలు గిప్ట్ ల రూపంలో అంద‌జేస్తుంటారు. ఈ క‌ల్చ‌ర్ తో తెలుగు ప‌రిశ్ర‌మ‌తో పాటు త‌మిళ్ ఇండ‌స్ట్రీలోనూ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అదే సినిమాకి మ్యూజిక్ కూడా బాగా కలిసొస్తే ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కి కూడా ప్ర‌త్యేకంగా బ‌హుమానాలు అందిస్తారు.

అలా వాళ్ల మ‌ధ్య ర్యాపో మ‌రింత బిల్డ్ అవుతుంటుంది. భ‌విష్య‌త్ లో ఎప్పుడైనా మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆ నిర్మాత‌కు వాళ్లు ఈజీగా లాక్ అవుతారు? అన్న‌ది ఇక్క‌డ ఓర‌క‌మైన స్ట్రాట‌జీ. అయితే ఇలా కార్లు..బంగళాలు బ‌హుమ‌తులు వాళ్లకు కొత్తేం కాదు. చాలా మంది నిర్మాత‌లు ర‌క‌ర‌కాల రూపాల్లో అందిస్తుంటారు. వీళ్లంద‌రికీ ఇంట్లో నాలుగైదు కార్లు అప్ప‌టికే ఉంటాయి. అయినా వాత్య‌ల్యం తో ఇస్తుంటారు.

అయితే కోలీవుడ్ యంగ్ హీరో ప్ర‌దీప్ రంగ‌నాధ్ మాథ్రం ద‌ర్శ‌కుడు బైక్ మీద వ‌స్తున్నాడ‌ని తెలిసి అత‌డికి ఓ కారు గిప్ట్ గా ఇచ్చిన సంగ‌తి వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు రివీల్ చేసారు. ప్ర‌దీర్ రంగ‌నాధ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా ` రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్` చిత్రాన్ని అశ్వ‌త్ మారిముత్తు తెర‌కెక్కిస్తున్నాడు. దీన్ని తెలుగులో మైత్రీ మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేస్తుంది. ఇదే సంస్థ ప్ర‌దీప్ రంగ‌నాద్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌దీప్ వ్య‌క్తిత్వాన్ని చెబుతూ కారు విష యాన్ని రివీల్ చేసారు.

ప్ర‌దీప్ రంగ‌నాధ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. `ల‌వ్ టుడే` చిత్రంలో తానే న‌టిస్తూ ద‌ర్శ‌క‌త‌వ్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా యువ‌త‌కి బాగా క‌నెక్ట్ అయింది. ఆ త‌ర్వాత హీరోగా బిజీ అయ్యాడు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడి క‌ష్టాలు తెలిసిన ప్ర‌దీప్ అశ్వ‌త్ మారిముత్తుకు కారు బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.