Begin typing your search above and press return to search.

దుమ్ముదులుపుతన్న జూనియర్ ధనుష్

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్.. ఇప్పుడు కోలీవుడ్లో ఈ పేరు ఒక సంచ‌ల‌నం. జ‌యం ర‌వి హీరోగా కోమ‌లి అనే కామెడీ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడీ కుర్రాడు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 3:30 AM GMT
దుమ్ముదులుపుతన్న జూనియర్ ధనుష్
X

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్.. ఇప్పుడు కోలీవుడ్లో ఈ పేరు ఒక సంచ‌ల‌నం. జ‌యం ర‌వి హీరోగా కోమ‌లి అనే కామెడీ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడీ కుర్రాడు. ఆ సినిమా ఓ మోస్త‌రుగా ఆడింది. త‌ర్వాత త‌నే హీరోగా న‌టిస్తూ ల‌వ్ టుడే అనే చిత్రాన్ని రూపొందించాడు. ఆ మూవీ త‌మిళంలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 2023లో కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ చిత్రాన్ని త‌ర్వాత తెలుగులోకి అనువాదం చేస్తే ఇక్క‌డా సూప‌ర్ హిట్ట‌యింది. డ‌బ్బింగ్ మూవీతోనే తెలుగులో ప్ర‌దీప్ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. చూడ్డానికి ధ‌నుష్ లాగే స‌న్న‌గా, సింపుల్‌గా క‌నిపిస్తాడు ప్ర‌దీప్. కెరీర్ ఆరంభంలో ధ‌నుష్‌ను చూసి ఇత‌నేం హీరో అనుకున్న‌ట్లే.. ల‌వ్ టుడే ప్రోమోలు చూసి ఇత‌ను క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం ఏంటి అన్నారు చాలామంది. కానీ సినిమాలో త‌న పెర్ఫామెన్స్, త‌న డైరెక్ష‌న్ స్కిల్స్‌కు ఫిదా అయిపోయారు. ఇప్పుడ‌త‌ను హీరోగా ఓ మై క‌డ‌వులే (తెలుగులో ఓరి దేవుడా) ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మారిముత్తు డైరెక్ట్ చేసిన డ్రాగ‌న్ (తెలుగులో రిట‌ర్న్ ఆఫ్ ద డ్రాగ‌న్) సినిమా రిలీజైంది.

ఈ మూవీ రిలీజ్‌కు ముందే మంచి బ‌జ్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ త‌ర్వాత డ్రాగ‌న్ కూడా ల‌వ్ టుడే త‌ర‌హాలోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ల‌వ్ టుడే స్థాయి ఎంట‌ర్టైన‌ర్ కాక‌పోయినా.. యూత్ ఈ చిత్రానికి బాగానే క‌నెక్ట్ అవుతున్నారు. ఇందులో ఫ‌న్, ఎమోష‌న్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇక ప్ర‌దీప్ పెర్ఫామెన్స్ గురించైతే చెప్పాల్సిన ప‌ని లేదు. కొన్ని సీన్ల‌లో త‌న న‌ట‌న‌కు థియేట‌ర్లు హోరెత్తిపోతున్నాయి. అనుప‌మ న‌ట‌న‌, కాయ‌దు లోహ‌ర్ గ్లామ‌ర్ కూడా ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. ఎబోవ్ యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు వీకెండ్లో అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. తెలుగు వెర్ష‌న్ సైతం శ‌ని, ఆదివారాల్లో మంచి ఆక్యుపెన్సీల‌తో న‌డిచింది. తెలుగులో ప‌ది కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించే దిశ‌గా దూసుకెళ్తోంది డ్రాగ‌న్ మూవీ. త‌మిళంలో కూడా భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా ఇది వంద కోట్ల సినిమా అవుతుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే క‌లెక్ష‌న్లు రూ..60 కోట్ల‌కు చేరువ‌గా ఉన్నాయి. ఈ సినిమాతో ప్ర‌దీప్ త‌న మార్కెట్‌ను మ‌రింత పెంచుకున్న‌ట్లే ఉన్నాడు.