Begin typing your search above and press return to search.

'డ్రాగన్‌' స్టార్‌ తెలుగు మైత్రి విశేషాలు..!

'కోమలి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ రంగనాథన్ 'లవ్‌ టుడే'తో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   12 March 2025 1:45 PM IST
డ్రాగన్‌ స్టార్‌ తెలుగు మైత్రి విశేషాలు..!
X

'కోమలి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ రంగనాథన్ 'లవ్‌ టుడే'తో హీరో గానూ ఎంట్రీ ఇచ్చాడు. తమిళ్‌లో వచ్చిన 'లవ్‌ టుడే' సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. లవ్ టుడే తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని 'డ్రాగన్‌' సినిమాతో ప్రదీప్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డ్రాగన్ సినిమాలో హీరోగా నటించిన ప్రదీప్‌ దర్శకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించాడు. ఇటీవల విడుదలైన డ్రాగన్‌ సినిమా తమిళ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులోనూ అదే టైటిల్‌తో విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. త్వరలో హిందీలోనూ డ్రాగన్ సినిమా రూపొందబోతుందనే వార్తలు వస్తున్నాయి.

ఒక వైపు దర్శకుడిగా మరో వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న ప్రదీప్‌ రంగనాథన్‌తో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం అందుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ప్రదీప్‌ రంగనాథన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను రూపొందించబోతున్నాడని సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. అయినా కూడా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేస్తున్నాయి. డ్రాగన్‌ వంటి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథతో ప్రదీప్‌ రంగనాథన్‌ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెలుగు, తమిళ్‌లో ఒకేసారి రూపొందించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలో నటిస్తున్న ప్రదీప్ రంగనాథన్‌ ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే నటీ నటుల ఎంపికతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రదీప్ రంగనాథన్‌ నటించబోతున్న సినిమాలో ఒక హీరోయిన్‌గా ప్రేమలు ముద్దుగుమ్మ మమిత బైజు నటించబోతుంది. ఈమె కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ సైతం ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

యూత్‌ ఆడియన్స్‌లో ఈమధ్య ప్రదీప్‌ రంగనాథన్‌కి మంచి క్రేజ్ ఉంది. అందుకే భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చి మరీ మైత్రి వారు ఆయనతో సినిమాకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. తెలుగులో పాటు తమిళ్‌లోనూ ఒకేసారి ఈ సినిమాను నిర్మించడం ద్వారా అక్కడ ఇక్కడ డబుల్‌ ఫ్రాఫిట్‌ దక్కించుకోవాలని మైత్రి వారు ప్లాన్‌ చేస్తున్నారట. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అందుకోని ఆఫర్‌ను మైత్రి వారి నుంచి ప్రదీప్‌ అందుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. వీరి కాంబో మూవీ ఇదే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.