ఆ యంగ్ హీరోకి 20 కోట్లా?
అయితే ఈ సినిమాకి రంగనాధ్ తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అక్షరాలా 20 కోట్ల రూపాయలు పారితోషికం ఛార్జ్ చేస్తున్నాడుట.
By: Tupaki Desk | 9 Jun 2024 7:26 AM GMTడైరెక్టర్ హీరోగా మారి సక్సెస్ అవ్వడం చిన్న విషయం కాదు. ఫేమ్ ..ఫాలోయింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఆ రెండు లేకుండా కూడా సక్సెస్ అవ్వొచ్చని నిరూపించాడు ప్రదీర రంగనాధ్ . తొలుత కొలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన రంగనాధ్ ఇప్పుడు హీరోగా దున్నేస్తున్నాడు. 'లవ్ టుడే' చిత్రానికి దర్శకత్వంతో పాటు నటించడంతో యువతలో బాగా సక్సస్ అయ్యాడు. ఆ సినిమా కంటెంట్ యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో రంగనాధ్ కి తిరుగులేకుండా పోయింది.
ప్రస్తుతం హీరోగా మంచి అవకాశాలొస్తున్నాయి. అందులో ఒకటి విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ఒకటి. అదే 'ఎల్ ఐసీ'. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పై నయనతార నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి రంగనాధ్ తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అక్షరాలా 20 కోట్ల రూపాయలు పారితోషికం ఛార్జ్ చేస్తున్నాడుట. నటుడిగా రెండవ సినిమాకే ఇంత పారితోషికమా? అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ అతడి ట్యాలెంట్ కి ఇది తక్కువే అన్న వారు లేకపోలేదు.
'లవ్ టుడే' సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేవలం యూత్ ఫుల్ కంటెంట్ కావడం తోనే అది సాధ్యమైంది. ఆ సినిమాకి తానే స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. ఇలా ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకుని 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ పేరుతో సినిమాని 70 కోట్లకు ఈజీగా బిజినెస్ చేయగలరు. విగ్నేశ్ శివన్ కి దర్శకుడిగా మంచి పేరుంది. పైగా ఈ సినిమాలో నయనతార కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రచారం సాగుతుంది.
అది కూడా నిజమైతే సినిమాకి మంచి మార్కెట్ జరుగుతుంది. 100 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలోనే జరిగిపోతుంది. ఆ నమ్మకంతోనే ప్రదీప్ డిమాండ్ చేసింనత ఇవ్వడానికి రౌడీ పిక్చర్స్ వెనక్కి తగ్గినట్లు లేదు. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ప్రారంభమై చాలా కాలమవుతుంది. కానీ ఇంకా పూర్తి కాలేదు. అతి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది.