Begin typing your search above and press return to search.

జూనియర్ దేవరకొండతో ఇంట్రెస్టింగ్ బ్యూటీ!

ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవ ను ఆనంద్ దేవరకొండ కు జోడీగా ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 Aug 2023 7:45 AM GMT
జూనియర్ దేవరకొండతో ఇంట్రెస్టింగ్ బ్యూటీ!
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మెల్ల మెల్లగా కెరీర్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే బేబీ సినిమా తో మంచి కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ జూనియర్ దేవరకొండ తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు గాను కమిట్ అయ్యాడు.

ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు కానీ బ్యాక్ గ్రౌండ్‌ వర్క్ స్పీడ్ గా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏఆర్ మురుగదాస్ అసిస్టెంట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ గురించి సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవ ను ఆనంద్ దేవరకొండ కు జోడీగా ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈమె ను తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ద కాపు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే అప్పుడే తెలుగు హీరోకు జోడీగా మరో సినిమా ఛాన్స్ దక్కించుకున్న ప్రగతి శ్రీవాస్తవ ముందు ముందు టాలీవుడ్‌ లో మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రగతి ఎంట్రీ తో కచ్చితంగా హైప్ పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బేబీ సినిమా సక్సెస్‌ తో ఫుల్‌ జోష్ లో ఉన్న ఆనంద్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకులతో పాటు నోటెడ్‌ దర్శకుల దర్శకత్వం లో కూడా ఆనంద్ దేవరకొండ సినిమాలు రాబోతున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే ఒక్కో సినిమాకు సంబంధించి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.