మైండ్ బ్లాక్ చేసిన ప్రగ్య బ్యాక్ లెస్ ఫోజ్
తాజాగా ఈ భామ బ్యాక్ లెస్ ఫోజ్ లో చెలరేగిపోయిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ప్రగ్య ఖరీదైన బ్లేజర్ ధరించి, తనదైన స్టైల్ లో వీపందం ప్రదర్శించింది.
By: Tupaki Desk | 23 March 2025 12:00 PM ISTసౌత్‌లో పాపులరై, బాలీవుడ్ ని ఏలాలని కలలు గంది ప్రగ్య జైశ్వాల్. ఈ బ్యూటీ ఇటీవల కొంతకాలంగా ముంబైలో సెటిలైంది. అక్కడ తన స్నేహితురాళ్లు మంచు లక్ష్మీ ప్రసన్న, రకుల్ ప్రీత్ లతో కలిసి కెరీర్ వేటలో బిజీ బిజీగా ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ కనెక్షన్స్ ని ప్రగ్య విడిచిపెట్టడం లేదు. తెలుగు పరిశ్రమలో అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఈ భామ ఇప్పటికే చాలా దూరం ప్రయాణించింది. పోరాటం సాగించింది. దశాబ్ధ కాలంగా అనుకున్నది సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.
టాలీవుడ్ లో తనదైన ముద్ర వేయాలని తపించిన ఈ భామ కొన్ని అరుదైన అవకాశాలను అందుకుంది. ఆరంభం కంచెలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రను అందుకుంది. వరుణ్ తేజ్ డెబ్యూ మూవీకి ప్రగ్య ప్రధాన ఆకర్షణగా మారింది. కానీ ఆ తర్వాత దానిని మరో స్థాయికి తీసుకెళ్లాల్సి ఉండగా, అగ్ర హీరోల సినిమాల్లో గ్లామరస్ పాత్రలకు పరిమితమైంది.
ఎన్బీకే సరసన అఖండ, డాకు మహారాజ్ లాంటి భారీ చిత్రాలలో నటించిన ప్రగ్య జైశ్వాల్, సల్మాన్ తో కిసీ కా భాయ్... లాంటి పరిధి తక్కువ ఉన్న పాత్రల్లో మెరిసింది. బాలయ్యతో రెండు సినిమాలు కమర్షియల్ విజయాలు అందుకున్నా బోల్డ్ పెర్ఫామర్ గా తన గుర్తింపును పరిమితం చేసాయి. తన ఎంపికల గురించి నిజాయితీగా అంగీకరించే ప్రగ్య జైశ్వాల్ తదుపరి మరో పెద్ద అవకాశం కోసం ప్రయత్నిస్తోంది.
ఈ గ్యాప్ లో అభిమానులకు సోషల్ మీడియాల ద్వారా టచ్ లో ఉంది. ప్రగ్య నిరంతర బోల్డ్ ఫోటోషూట్లు ఇన్ స్టాలో వైరల్ గా దూసుకెళుతున్నాయి. తాజాగా ఈ భామ బ్యాక్ లెస్ ఫోజ్ లో చెలరేగిపోయిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ప్రగ్య ఖరీదైన బ్లేజర్ ధరించి, తనదైన స్టైల్ లో వీపందం ప్రదర్శించింది. చూపులు తిప్పుకోనివ్వని ఈ లుక్ కుర్రకారు గుండెల్ని మరిగిస్తోంది. అఖండ 2 , టైసన్ నాయుడు లాంటి భారీ చిత్రాల్లో ప్రగ్య నటిస్తోంది.