Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : అందాల ప్రగ్యా క్లోజప్‌ షో

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి క్లోజప్‌ షో తో ప్రగ్యా కన్నుల విందు చేసింది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 8:59 AM GMT
పిక్‌టాక్‌ : అందాల ప్రగ్యా క్లోజప్‌ షో
X

వరుణ్ తేజ్‌తో కలిసి కంచె సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ నటించి మెప్పించింది. అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా అలరించకున్నా కంచె సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్‌ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్‌లో స్టార్‌డం దక్కించుకోలేక పోయినా అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు 'డాకు మహారాజ్‌' సినిమాలో బాలకృష్ణకి జోడీగా నటించి మెప్పించింది. అంతకు ముందు అఖండ సినిమాలోనూ ప్రగ్యా జైస్వాల్‌ నటించి సక్సెస్‌ను దక్కించుకుంది.


యంగ్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లు రాకున్నా కెరీర్‌లో ఈ అమ్మడు ఇన్నాళ్లు కొనసాగడానికి ప్రధాన కారణం అందం అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ వార్తల కారణంగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్‌ నుంచి మెల్ల మెల్లగా ఈ అమ్మడు ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. కానీ ఇతర భాషల్లో ప్రగ్యా జైస్వాల్‌కి సాలిడ్ హిట్‌ దక్కడం లేదు. అయినా అక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.


తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి క్లోజప్‌ షో తో ప్రగ్యా కన్నుల విందు చేసింది. క్లీ వేజ్‌ షో తో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి తన అందంతో మెప్పించింది. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలకృష్ణకు జోడీగా అఖండ 2 సినిమాలో నటిస్తోంది. మరో సినిమాలోనూ ఈమె నటించబోతుంది. హిందీలో ఈమె నటించిన సినిమా ఇటీవల విడుదలై నిరాశ పరిచింది. త్వరలో మరో హిందీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.


మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 1991లో జన్మించిన ఈ అమ్మడు పూణేలోని సింబియోసిస్‌ లా స్కూల్‌ నుంచి విద్యను పూర్తి చేసింది. సింబియోసిస్‌ యూనివర్శిటీలో ఉన్న సమయంలోనే అందాల పోటీల్లో పాల్గొంది. చిన్న వయసులోనే మోడలింగ్‌ చేయడం ద్వారా సినిమాల్లో ఆసక్తిని పెంచుకుంది. 2015లో తెలుగు సినిమా కంచె సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ప్రగ్యా జైస్వాల్‌ టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసింది. టాలీవుడ్‌లో ప్రగ్యా జైస్వాల్‌ పలు పాత్రల్లో నటించినా ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కానీ ఇలాంటి అందమైన ఫోటోల వల్ల పాపులారిటీని సొంతం చేసుకుంది.