స్టార్ క్రికెటర్‌తో కంచె బ్యూటీ డేటింగ్?
తాజా ఇంటర్వ్యూలో ప్రగ్యా ``తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది. తాను హుషారైన కుర్రాడితో డేటింగ్ కి సిద్ధంగా ఉన్నానని కూడా వెల్లడించింది.
By: Tupaki Desk | 1 Dec 2024 9:30 PM GMTప్రగ్యా జైస్వాల్ పరిచయం అవసరం లేదు. కంచె సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ప్రగ్య జైశ్వాల్ హిందీలోను అగ్రహీరో సల్మాన్ సరసన నటించింది. హిందీలో విడుదలకు సిద్ధమవుతున్న తన తదుపరి సినిమాను చురుకుగా ప్రమోట్ చేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రగ్యా ``తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది. తాను హుషారైన కుర్రాడితో డేటింగ్ కి సిద్ధంగా ఉన్నానని కూడా వెల్లడించింది. క్రికెటర్‌తో డేటింగ్ చేస్తావా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ప్రగ్యా కళ్ళు మెరిసిపోయాయి... ఎందుకు కాదు? తప్పకుండా! అంటూ ఎగ్జయిట్ అయింది.
యువ క్రికెటర్ శుభమాన్ గిల్ పేరు చెప్పగానే ప్రగ్యా పెద్దగా నవ్వేస్తూ.. ``ఎందుకు కాదు? విధి రాత రాసి ఉంటే ఏదైనా జరగొచ్చు. నేను విధిని నమ్ముతాను`` అని వ్యాఖ్యానించింది. అయితే టాలీవుడ్ లో పెద్ద కథానాయికగా ఎదగాలన్న తన కల నెరవేరలేదు. తన విధి గురించి ప్రగ్య చాలా స్పష్ఠంగా ఉంది. కానీ అది మారడం లేదు. ఇక శుభ్ మాన్ గిల్ .. క్రికెట్ గాడ్ సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడని ఇంతకుముందు కథనాలొచ్చాయి కాబట్టి అతడు ప్రగ్యను ప్రేమించే అవకాశం లేదు.
ప్రగ్యా తదుపరి బాలకృష్ణ సరసన `అఖండ 2`లో నటించనుంది. స్టార్ హీరో బాలకృష్ణ భార్య పాత్రను పోషించనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో ప్రగ్య వరుసగా సీనియర్ హీరో బాలయ్యకు కథానాయికగా మారింది.