ఎరక్కపోయి ఇరుక్కుపోయిన అందం
ముంబై పరిశ్రమలో దూసుకెళ్లడమే ధ్యేయంగా ఏదో ఒక క్రేజీ మిషన్ చేపట్టినట్టు కూడా గుసగుసలు వినిపించాయి.
By: Tupaki Desk | 11 Nov 2024 4:09 AM GMTకంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ ఇటీవల తెలుగు చిత్రసీమకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ భామ రెగ్యులర్ గా ముంబైలో తన స్నేహితురాళ్లు రకుల్ ప్రీత్, మంచు లక్ష్మితో పాటు కనిపిస్తోంది. ఆ ముగ్గురూ కలిస్తే అక్కడ సందడి పరాకాష్టకు చేరుకుంటోంది. ముంబై పరిశ్రమలో దూసుకెళ్లడమే ధ్యేయంగా ఏదో ఒక క్రేజీ మిషన్ చేపట్టినట్టు కూడా గుసగుసలు వినిపించాయి.
ప్రగ్య మాత్రం పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న ఈ బ్యటీ... నిరంతరం ఫోటోషూట్లు, వీడియోషూట్లను షేర్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు ఇవన్నీ రీచ్ అవుతున్నాయి. తాజాగా ప్రగ్య షేర్ చేసిన ఓ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కొత్త లుక్ యూత్ లోకి వేగంగా దూసుకెళుతోంది.
ప్రగ్య చిట్టి పొట్టి నిక్కరు షోల్డర్ లెస్ టాప్ ధరించి టూ హా*గా కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రగ్య లాంజ్ లో ఒక చైర్ లో కూచుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇవన్నీ ఎంతో ప్రొఫెషనల్ గా కనిపిస్తున్నాయి. ప్రగ్య ముఖంలో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ డిజైనర్ ఫోటోగ్రాఫ్స్ ని యూత్ వైరల్ గా షేర్ చేస్తున్నారు.
తెలుగు, హిందీలో అవకాశాల కోసం ప్రయత్నాలు ఆపని ప్రగ్య ఇటీవల వెబ్ సిరీస్ లలో నటించేందుకు సంతకాలు చేస్తోందని సమాచారం. తాజా ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.