ప్రగ్యా జైస్వాల్.. గ్లామర్ దేవతలా మెరిసిపోతూ..
ప్రగ్యా జైస్వాల్ ఈ ఫోటోల్లో తన గ్లామర్ డోస్‌ను మితిమీరి హైలైట్ చేయకపోయినా, సొగసైన వ్యక్తిత్వంతో మెరిసింది.
By: Tupaki Desk | 21 Nov 2024 4:28 AM GMTగ్లామరస్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఎప్పటికప్పుడు తన అందంతో సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించిన అమ్మడు నటనకు తోడు గ్లామర్ షోతో అభిమానులను ఆకట్టుకుంది. 2015లో వచ్చిన కంచె చిత్రంతో మొదటి పెద్ద విజయాన్ని అందుకున్న ప్రగ్యా ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంది. కానీ ఈమధ్య మాత్రం అమ్మడు కాస్త స్లో అయ్యింది.
తాజాగా ఆమె పాల్గొన్న బ్రాండ్ విజన్ అవార్డ్స్ ఈవెంట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్రౌన్ నెట్ గౌన్ ధరించి, అందంగా ముస్తాబైన ప్రగ్యా తన క్యూట్ పోజులతో కుర్రాళ్ల మనసును దోచేసింది. ఈ గౌన్ లో ప్రగ్యా చూపించిన ఆహార్యం, ఆమె ఒంపుసొంపులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ హెయిర్ స్టైల్, ఎలిగెంట్ జువెలరీతో ఆమె స్టన్నింగ్ అనేలా స్టిల్ ఇచ్చింది.
ప్రగ్యా జైస్వాల్ ఈ ఫోటోల్లో తన గ్లామర్ డోస్‌ను మితిమీరి హైలైట్ చేయకపోయినా, సొగసైన వ్యక్తిత్వంతో మెరిసింది. "బ్రౌన్ టోన్ లో ఆమె చార్మింగ్ లుక్ అదిరిపోయింది" అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కంచె తర్వాత ఆమె నటించిన జయ జానకి నాయక, అఖండ చిత్రాల్లో యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా అఖండ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన ఆమె రోల్ సూపర్ హిట్ అయ్యింది.
అయితే, ఈ విజయం తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ప్రగ్యా నందమూరి బాలకృష్ణ NBK 109 లో మరియు బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు చిత్రాల్లో నటిస్తున్నారు. సినిమా అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియాలో ప్రగ్యా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును నిలబెట్టుకుంది. తరచుగా ఇలాంటి ఫోటోషూట్ల ద్వారా అభిమానులకు కనువిందు చేస్తూ తన క్రేజ్ కొనసాగిస్తోంది. అఖండ సీక్వెల్ లో ఆమె పాత్ర మరింత ఆకట్టుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ప్రగ్యా కెరీర్ మరోసారి హిట్ ట్రాక్ లోకి వస్తుందా లేదా అనేది చూడాలి.