Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఎల్లో చీరలో చూపు తిప్పనివ్వని ప్రగ్యా

ఆ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్‌ టాలీవుడ్‌లో బిజీ కావడం కన్ఫర్మ్‌ అని అంతా అనుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 10:15 AM GMT
పిక్‌టాక్‌ : ఎల్లో చీరలో చూపు తిప్పనివ్వని ప్రగ్యా
X

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌కు జోడీగా ఆ సినిమాలో నటించిన ప్రగ్యా జైస్వాల్‌ అందంతో పాటు అభినయంతో అలరించింది. ఆ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్‌ టాలీవుడ్‌లో బిజీ కావడం కన్ఫర్మ్‌ అని అంతా అనుకున్నారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. గత పదేళ్లుగా ఈ అమ్మడు అడపా దడపా సినిమాలతోనే కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. హిట్‌ పడ్డా కెరీర్‌ మలుపు తిరగడం లేదు. స్పీడ్‌ అందుకోకుండా మెల్లగా ఈ అమ్మడి సినీ కెరీర్‌ సాగుతూనే ఉంది.


దశాబ్ద కాలంగా పెద్దగా ఆఫర్లు లేకున్నా ఇండస్ట్రీలో కొనసాగుతుంది అంటే కారణం ఆమె అందం అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో ప్రగ్యా రెగ్యులర్‌గా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఎల్లో చీర కట్టు ఫోటోలతో మెరిసింది. అందమైన ప్రగ్యా చీర కట్టులో మరింత అందంగా ఉంటుంది అనే విషయం గతంలోనే వెల్లడి అయింది. ఇప్పుడు ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది అంటూ సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలకు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రగ్యా అందమైన ఫోటోను చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక పోతున్నామని అంటున్నారు.


చీర కట్టులో గతంలో నడుము, నాభి అందం చూపిస్తూ తెగ కవ్వించి, కన్నుల విందు చేసిన ముద్దుగుమ్మ ప్రగ్యా మరోసారి ఎల్లో చీర కట్టు ఫోటోలతో మెప్పించింది. ప్రగ్యా చీర కట్టులో చాలా అందంగా ఉంటుంది, ఈ సారి అంతకు మించి అన్నట్టు ఆమె అందం ఉంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ముద్దుగుమ్మకు యంగ్‌ హీరోల నుంచి ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు బాలీవుడ్‌లో అయినా ఈమెను ఫిల్మ్‌ మేకర్స్‌ పరిగణలోకి తీసుకుని వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.


బాలకృష్ణతో గతంలో ఈమె నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాను చేసింది. ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా త్వరలోనే ప్రగ్యా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అఖండ 2 లోనూ ఈమె హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.