Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : అందాల ప్రగ్యా క్లోజప్‌ షో అదుర్స్‌

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఎదురు చూడాల్సి వస్తుంది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 11:32 AM GMT
పిక్‌టాక్ : అందాల ప్రగ్యా క్లోజప్‌ షో అదుర్స్‌
X

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దకాలం అయినా ప్రగ్యా జైస్వాల్‌ సాలిడ్ స్టార్‌డంను దక్కించుకోవడంలో మాత్రం సఫలం కాలేదు. కొన్ని సినిమాలు సక్సెస్‌ అయినా ఈమెకి మాత్రం ఆ క్రెడిట్ దక్కలేదు. అఖండ, డాకు మహారాజ్ సినిమాల్లో నటించి సక్సెస్ దక్కించుకున్నా ప్రగ్యా జైస్వాల్‌ వెంట వెంటనే ఆఫర్లు మాత్రం దక్కించుకోలేక పోతుంది. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ పదేళ్ల కాలంలో ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి, కొన్ని హిట్‌ అయితే ఎక్కువ శాతం నిరాశ పరిచాయి. అయినా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం అందం అనడంలో సందేహం లేదు.


ప్రగ్యా జైస్వాల్‌ తన అందమైన ఫోటో షూట్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా మూడు మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ప్రగ్యా జైస్వాల్‌ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఇంతటి అందమైన ప్రగ్యా జైస్వాల్‌కి ఎందుకు వరుసగా ఆఫర్లు రావడం లేదు, ఎందుకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ దక్కలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ప్రగ్యా తన అందంతో ఆఫర్లు దక్కించుకోవాల్సి వస్తుంది. నటన పరంగా కొన్ని సినిమాల్లో అవకాశం దక్కడంతో మెప్పించింది. అయినా నటిగా ఛాన్స్ దక్కడం లేదు.


తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అందమైన ఫోటో షూట్‌ను షేర్‌ చేసింది. ఈసారి అంతకు మించి అంటూ తన అందాల ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది. సింపుల్‌ ఔట్ ఫిట్‌లో మెడలో ఆభరణాలు ఏమీ లేకుండా క్లీవేజ్‌ షో చేస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా అందంగా ఉన్న ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇలాంటి ఫోటోలను షేర్‌ చేయడంతో ఫిల్మ్‌ మేకర్స్‌ పిలిచి ఆఫర్లు ఇస్తున్నారు. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ సినిమాలు ఆకట్టుకోవడం లేదు, ఒక వేళ హిట్‌ అయినా ఈమెకు పెద్దగా గుర్తింపు రావడం లేదు. ముందు ముందు అయినా ప్రగ్యా జైస్వాల్‌కి హీరోయిన్‌గా మంచి ఆఫర్లు వస్తాయా అంటూ ఆమె ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ప్రగ్యా జైస్వాల్‌ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాదిలో డాకు మహారాజ్‌తో మొదలు పెట్టింది. ఇదే ఏడాదిలో మరోసారి బాలకృష్ణతో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించిన కారణంగా సీక్వెల్‌లోనూ ఆమె నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా హిందీ, తమిళ్‌లోనూ చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రగ్యాకి మరో పెద్ద బిగ్‌ హిట్‌ పడుతుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.