ఏజ్ గ్యాప్ మ్యాటరే కాదంటున్న ప్రగ్యా
నందమూరి బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ప్రగ్యా జైస్వాల్. అఖండ సినిమాతో పాటూ మొన్న సంక్రాంతికి రిలీజైన డాకు మహారాజ్ సినిమాలో కూడా ప్రగ్యా బాలయ్య సరసన జోడీగా నటించింది.
By: Tupaki Desk | 29 Jan 2025 11:30 AM GMTనందమూరి బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ప్రగ్యా జైస్వాల్. అఖండ సినిమాతో పాటూ మొన్న సంక్రాంతికి రిలీజైన డాకు మహారాజ్ సినిమాలో కూడా ప్రగ్యా బాలయ్య సరసన జోడీగా నటించింది. ఈ నేపథ్యంలో బాలయ్య, ప్రగ్యా మధ్య వయసు తేడా చాలా ఉందని, అంత ఏజ్ గ్యాప్ తో ఎలా కలిసి నటించారని విమర్శలు కూడా వచ్చాయి.
ఈ విషయంలో ప్రగ్యా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తనకు, హీరోకు మధ్య వయసు వ్యత్యాసమున్న మాట నిజమేనని, కానీ అదసలు మ్యాటరే కాదని, స్క్రీన్ మీద ఇద్దరినీ చూసినప్పుడు బాగా కనిపిస్తే చాలని తెలిపింది. పాత్రను ఎలా డిజైన్ చేశారో దాన్ని బట్టే నటీనటులను తీసుకుంటారని, ఆ పాత్రకు న్యాయం చేయగలను అనిపిస్తేనే ఆ సినిమాలో నటిస్తాను అంతే తప్ప ఏజ్ గ్యాప్ ను పట్టించుకోనని ప్రగ్యా జైస్వాల్ తెలిపింది.
ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ, ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందాన్నిస్తుందని, ఆయన పక్కన ఉంటే పాజిటివిటీ ఉంటుందని, బాలయ్య గారి నుంచి చాలా నేర్చుకోవచ్చని ప్రగ్యా చెప్పింది. బాలయ్య అందరినీ సమానంగా చూస్తారని, అందరికీ సహకారం అందిస్తూ అందరి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారని చెప్పిన ప్రగ్యా.. కెమెరా ఆన్, ఆఫ్ మధ్యలో ఈజీగా ఎలా మారొచ్చో ఆయన లాంటి లెజెండ్స్ దగ్గర చూసి నేర్చుకోవాలని, ఆయనలో ఎలాంటి ఫిల్టర్స్ ఉండవని బాలయ్యను తన పొగడ్తలతో ఆకాశానికెత్తేసింది.
డాకు మహారాజ్ గురించి చెప్తూ ఆ సినిమా తన పుట్టినరోజైన జనవరి 12న రిలీజైందని తెలిపింది. తన బర్త్ డే రోజున రిలీజవడమే స్పెషల్ అనుకుంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం మరో స్పెషల్ అని, బాలయ్య గారితో కలిసి ఆ విజయాన్ని అందుకోవడం ఇంకా స్పెషల్ అని ప్రగ్యా తెలిపింది. ఈ ఇయర్ తనకు మంచి ఆరంభాన్ని ఇచ్చిందని, సినిమాలో కావేరి పాత్రపై అందరూ ప్రేమను కురిపిస్తున్నారని ప్రగ్యా తెలిపింది.
డాకు మహారాజ్ చూశాక అందరూ తనని డాకు మహారాణి అంటున్నారని, సినిమాలో గర్భవతిగా నటించడం చాలా కొత్తగా అనిపించిందని, కడుపులోని బిడ్డ కోసం కావేరి చేసిన పోరాటాన్ని అందరూ అభినందిస్తున్నారని ప్రగ్యా ఆనందం వ్యక్తం చేసింది. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను అందుకుని మంచి హిట్ గా నిలిచింది.