ప్రగ్యా జైస్వాల్.. బికినీ కంటే ఘాటైన గ్లామర్ లుక్
సినిమాలతో పాటు ఫ్యాషన్, ఫొటోషూట్లలో కూడా తనదైన ముద్ర వేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Desk | 19 March 2025 1:58 PM ISTసినిమా ఇండస్ట్రీలో గ్లామర్, టాలెంట్ తో భిన్నంగా ఆకట్టుకునే నటి ప్రగ్యా జైస్వాల్. తన తొలి చిత్రం కంచెతోనే అందాన్ని, అభినయాన్ని హైలెట్ చేసిన ఆమె, ఆ తర్వాత అఖండ, జయ జానకి నాయక, నక్షత్రం లాంటి చిత్రాల్లో మెరిసింది. గ్లామర్‌తో పాటు తన పాత్రలలో బలమైన నటనను చూపించగల నటి అని గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు ఫ్యాషన్, ఫొటోషూట్లలో కూడా తనదైన ముద్ర వేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోషూట్ మరింత ట్రెండ్ అవుతోంది. ఫార్మల్ గోప్పదనం, బోల్డ్ అటిట్యూడ్ కలిపి ఈ స్టైలింగ్‌ను ప్రగ్యా అద్భుతంగా క్యారీ చేసింది. స్ట్రైప్‌డ్ సూట్‌లో స్మార్ట్ లుక్‌తో బాస్ లేడీలా కనిపిస్తూ స్టన్నింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకు పోజిచ్చింది. ‘The boss just called’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి.
ఇందులో ఆమె మేకప్, స్టైలింగ్ మరింత అట్రాక్ట్ చేస్తోంది. సింపుల్ అయినా గ్రేస్‌ఫుల్ లుక్ ఆమెకు మరింత గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. మెటాలిక్ జ్యువెలరీ, మోడరన్ హెయిర్‌స్టైల్ ఆమె లుక్‌కు అదనపు హైలైట్‌గా నిలిచాయి. ఈ ఫోటోషూట్ కోసం ప్రముఖ స్టైలిస్టులు, ఫ్యాషన్ డిజైనర్లు పని చేశారు. సుకృతి స్టైలింగ్ అందించగా, ఎన్ మ్ డిజైనర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన అవుట్‌ఫిట్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసింది.
ప్రగ్యా సినిమాల పరంగా చూస్తే, ఆమె ప్రస్తుతం కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతోంది. అఖండలో కనిపించిన ఆమె, మరో పెద్ద ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె గ్లామర్, టాలెంట్ రెండింటినీ కలిపి సరికొత్త ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటుందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలోను, సినిమాల్లోను ప్రగ్యా తనదైన శైలిని కొనసాగిస్తూనే ఉంది. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ మరోసారి ఆమె స్టైలిష్ అవతార్‌ను చూపించింది. గ్లామర్, గ్రేస్ కలిపిన ప్రగ్యా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.