గవ్వల బ్లౌజ్‌లో ప్రగ్య హొయలు చూసారా?
కంచె, అఖండ, జయ జానకి నాయక, నక్షత్రం లాంటి చిత్రాల్లో తనదైన అందం నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 9 Feb 2024 4:41 AM GMTకంచె, అఖండ, జయ జానకి నాయక, నక్షత్రం లాంటి చిత్రాల్లో తనదైన అందం నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కేవలం నటనతోనే కాదు.. తన హాట్ లుక్స్‌తో హీట్ పెంచడంలోను ముందుంటుంది. ప్రగ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే స్పెషల్ ఫోటోషూట్లు, వీడియోలతో ఫ్యాన్స్ హృదయాన్ని దొంగిలిస్తుంది. ఈ బ్యూటీకి 2.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నరంటే తన అందానికి ఫాలోయింగ్ రేంజ్ ను అర్థం చేసుకోవాలి.
ప్రగ్యా జైస్వాల్ 2014 సంవత్సరంలో తమిళ చిత్రం `విరాట్టు`తో నటిగా తన కెరీర్ ప్రయాణాన్ని ప్రారంభించింది. టాలీవుడ్ లో కంచె చిత్రంలో తన అద్భుత నటనతో మైమరిపించింది. అటుపై వరుసగా డజను పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇన్ స్టా మాధ్యమంలోను ప్రగ్య స్పీడ్ గా ఉంది. సోషల్ మీడియాలో ప్రగ్య తాజా ఫోటోషూట్ ఇప్పుడు యువతరంలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో ప్రగ్య సింపుల్ గా నవ్వేస్తూ తన రూపలావణ్యాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రగ్య తన పాల నురుగు దేహశిరులను చీరలో ఆవిష్కరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వీటన్నిటినీ మించి గవ్వలతో తయారు చేసిన ఆ స్పెషల్ డిజైనర్ టాప్ మతులు చెడగొడుతోంది. ప్రగ్య బ్లూ ఫ్లోరల్ శారీ.. డిజైనర్ గవ్వల బ్లౌజులో ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో షూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ప్రగ్య చివరిగా అఖండలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు లేవు. సల్మాన్ భాయ్ కిసీ కా భాయ్ కిసీకా జాన్ చిత్రంలోను నటించినా అది కూడా ఏమంత కలిసి రాలేదు. తదుపరి ఒక క్రేజీ ప్రకటనతో ఈ బ్యూటీ మరోసారి లైమ్ లైట్ లోకి రానుందని తెలిసింది.