Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఓ బిగ్‌ ఆఫర్ పట్టింది

మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి కంచె సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌.

By:  Tupaki Desk   |   14 Jun 2024 5:30 PM GMT
ఎట్టకేలకు ఓ బిగ్‌ ఆఫర్ పట్టింది
X

మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి కంచె సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. ఈ అమ్మడు మొదటి సినిమాతో నటిగా, అందంతో మెప్పించింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి అంతగా ఆఫర్లు రాలేదు. ఇన్నాళ్ల కెరీర్ లో ఈ అమ్మడు చేసింది చాలా తక్కువ సినిమాలే అనడంలో సందేహం లేదు.

టాలీవుడ్ లో ఆ మధ్య బాలకృష్ణ కు జోడీగా అఖండ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత మోహన్ బాబు నటించిన సన్నాఫ్‌ ఇండియా సినిమాలోనూ నటించింది. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా సన్నాఫ్ ఇండియా అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది.

ఇన్నాళ్లుగా ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎట్టకేలకు ఈ అమ్మడికి బాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ దక్కింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మూవీలో ఈ అమ్మడికి ఆఫర్‌ దక్కిందట.

అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఖేల్‌ ఖేల్‌ అనే సినిమా రూపొందుతుంది. ఆ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అందులో ఒక హీరోయిన్‌ గా తాప్సి నటిస్తుండగా మరో హీరోయిన్ గా వాణీ కపూర్ ను నటింపజేస్తున్నారు. వీరిద్దరికి బాలీవుడ్‌ లో మంచి ఫాలోయింగ్‌ ఉంది.

మూడో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15న ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని అక్షయ్ కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.