Begin typing your search above and press return to search.

అఖండ బ్యూటీ.. ఇప్పుడైనా లక్కు మారేనా?

అఖండ సినిమాలో బాలకృష్ణకి జోడీగా నటించిన అందాల భామ ప్రగ్యా జైశ్వాల్.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:13 AM GMT
అఖండ బ్యూటీ.. ఇప్పుడైనా లక్కు మారేనా?
X

అఖండ సినిమాలో బాలకృష్ణకి జోడీగా నటించిన అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. ఈ అమ్మడు తమిళంలో విరాట్టు సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత మిర్చీ లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ లోకి 2014లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నెక్స్ట్ వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ కంచె సినిమాలో ప్రగ్య జైశ్వాల్ నటించింది. ఈ మూవీ కమర్షియల్ గా అనుకున్నంత లాభాలు తెలికపోయినా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.

మూవీలో ప్రగ్యా జైశ్వాల్ పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రగ్యా జైశ్వాల్ స్టార్ హీరోయిన్ కావడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. కానీ ఈ బ్యూటీకి అదృష్టం కలిసిరాలేదు. దీంతో నెక్స్ట్ చేసిన ఏ మూవీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆమె కూడా మేగ్జిమమ్ గ్లామర్ రోల్స్ కి పరిమితం అయ్యింది. చివరిగా తెలుగులో అఖండ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలయ్యకి జోడీగా ఈ మూవీలో కనిపించింది.

కమర్షియల్ గా అఖండ వర్క్ అవుట్ అయ్యి బ్లాక్ బస్టర్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ ప్రగ్యా జైశ్వాల్ కి మాత్రం తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తరువాత మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా చిత్రంలో ఆమె నటించింది. ఈ మూవీ ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరల NBK 109 చిత్రంలో ఒక హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ కి ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ మీద ప్రగ్యా చాలా హోప్స్ పెట్టుకుంది.

మరో వైపు ఈ ముద్దుగుమ్మ నటిగా తన రెండో సినిమాని హిందీలో టిట్లు ఎంబిఏ టైటిల్ తో చేసింది. మరల 10 ఏళ్ళ తర్వాత హిందీలో ఇప్పుడు ఛాన్స్ అందుకుంది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఖేల్ ఖేల్ మే చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ ఓ క్యారెక్టర్ లో నటించింది. హాలీవుడ్ మూవీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాలో ఆమె పాత్ర కూడా కీలకంగానే ఉండబోతోందని తెలుస్తోంది. కాబట్టి తప్పనిసరిగా ఆమె ఒక హిట్టు కొట్టాల్సిన అవసరం ఉంది.

అక్షయ్ కుమార్ గత కొన్నేళ్ల నుంచి సరైన సక్సెస్ లు అందుకోవడం లేదు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు రు రిలీజ్ చేస్తున్న కమర్షియల్ సక్సెస్ మాత్రం కావడం లేదు. దీంతో అతని మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. ఇలాంటి సమయంలో ఆగష్టు 15న ఖేల్ ఖేల్ మే మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రగ్యా జైశ్వాల్ కి ఈ మూవీ బాలీవుడ్ లో డోర్స్ ఓపెన్ చేస్తుందా అనేది చూడాలి.